ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, అలవెన్సులపై మీ డిమాండ్స్ ఏంటి? 8వ పే కమిషన్‌కు డైరెక్ట్‌గా పంపేయండిలా!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం పనులు వేగవంతం అయ్యాయి. భవిష్యత్తులో మిలియన్ల మంది ఉద్యోగుల జీతాల నిర్మాణం, అలవెన్సులు, పెన్షన్ ప్రయోజనాలను డిసైడ్ చేసేందుకు ఈ కమిషన్ కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది, అసోసియేషన్ల నుండి నేరుగా సలహాలు, డిమాండ్లు, , ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరించడానికి తలుపులు తెరిచింది. మీ మనసులో ఉన్న డిమాండ్లను కమిషన్‌కు నేరుగా తెలియజేయడానికి ఇదొక గొప్ప అవకాశం.

అందరి కోసం ఆన్‌లైన్ పోర్టల్!
ఈ సంప్రదింపుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉంచేందుకు 8వ వేతన సంఘం (8th pay commission) ఒక ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా స్టేక్‌హోల్డర్లు తమ మెమోరాండమ్‌లు, ప్రాతినిధ్యాలను డిజిటల్ రూపంలో సమర్పించవచ్చు. ఇక్కడ వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే కమిషన్ రాబోయే రోజుల్లో శాలరీ రివిజన్, అలవెన్సులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ , సర్వీస్ కండిషన్లపై కీలక సిఫార్సులు చేయనుంది.
ఎవరెవరు సూచనలు ఇవ్వవచ్చు?
ఈ ప్రక్రియలో కేవలం రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే కాదు, కింది వారందరూ తమ ఇన్పుట్స్ ఇవ్వవచ్చని కమిషన్ స్పష్టం చేసింది..
• కేంద్ర ప్రభుత్వ సిబ్బంది అందరూ
• పెన్షనర్లు , ఫ్యామిలీ పెన్షనర్లు
• డిఫెన్స్ (రక్షణ రంగ) ఉద్యోగులు
• ఆల్ ఇండియా సర్వీసెస్ సభ్యులు
• ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు
• కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు
ఆన్‌లైన్‌లో మెమోరాండం సమర్పించడం ఎలా?
అభిప్రాయాలను కేవలం అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే పంపాల్సి ఉంటుంది. ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్లు, ఈమెయిల్స్ లేదా పీడీఎఫ్ (PDF) ఫైళ్లను కమిషన్ అంగీకరించదు. ప్రాసెస్ ఇలా ఉంటుంది..
1. మొదట 8వ సీపీసీ (CPC) అధికారిక పోర్టల్‌ను విజిట్ చేయాలి.
2. మీ వాలిడ్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
3. అక్కడ అందుబాటులో ఉండే ఆన్‌లైన్ మెమోరాండం ఫారమ్‌ను ఫిల్ చేయాలి.
4. పే స్కేల్స్, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డీఏ (DA), పెన్షన్లు లేదా సర్వీస్ కండిషన్లపై మీ సలహాలను ఎంటర్ చేయాలి.
5. ఫారమ్‌ను రివ్యూ చేసి ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి. అనంతరం వచ్చే అక్నాలెడ్జ్‌మెంట్ లేదా రిఫరెన్స్ నెంబర్‌ను భద్రపరుచుకోవాలి.
లాస్ట్ డేట్ ఎప్పుడు?
ఎక్కువ మంది ఉద్యోగులు, భాగస్వాములు పాల్గొనేలా ప్రోత్సహించడానికి కమిషన్ ఈ గడువును ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. తాజా అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, మెమోరాండం సమర్పించడానికి ఆఖరి తేదీని 15 జూన్ 2026 వరకు పొడిగించారు. ఇదే చివరి పొడిగింపు అని, ఆసక్తి గల వారు ఈ లోపే తమ సబ్మిషన్స్ పూర్తి చేయాలని కమిషన్ స్పష్టం చేసింది.
ఇది ఎందుకు అంత ముఖ్యం?
రాబోయే దశాబ్ద కాలం పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను ఈ కమిషన్ సిఫార్సులే శాసిస్తాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి? సవరించిన పే మ్యాట్రిక్స్ ఎలా ఉండాలి? కరువు భత్యం (Dearness Allowance) లెక్కింపు ఎలా జరగాలి? వంటి ఎన్నో కీలక అంశాలు ఈ చర్చల్లో తేలనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలు ఇప్పటికే తమ డిమాండ్లతో కూడిన డ్రాఫ్ట్‌లను సిద్ధం చేస్తున్నాయి. కాబట్టి, మీ జీతభత్యాల విషయంలో మీ స్వరాన్ని వినిపించడానికి, పాలసీ ఫార్మేషన్‌లో భాగస్వాములు కావడానికి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు!


Click it and Unblock the Notifications