కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్! ముగిసిన డెడ్‌లైన్.. 8వ వేతన సంఘం వద్దకు చేరిన డిమాండ్లు ఇవే!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th pay commission) ప్రక్రియలో మొదటి కీలక అంకం పూర్తయింది. ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల అసోసియేషన్లు తమ ప్రతిపాదనలను, డిమాండ్లను ఆన్‌లైన్ ద్వారా సమర్పించడానికి విధించిన జూన్ 15 చివరి డెడ్‌లైన్ ముగిసింది. ఇకపై ఉద్యోగుల డిమాండ్లలో వేటిని కమిషన్ అంగీకరిస్తుంది, వేటిని తిరస్కరిస్తుంది అనే తదుపరి ప్రక్రియపై అందరి నజర్ పడింది. ఈసారి ఉద్యోగ సంఘాలు కనీస బేసిక్ శాలరీ పెంపుతో పాటు పలు సంచలన మార్పులను కోరడం విశేషం.

8th Pay Commission Memorandum deadline ends What have employee unions asked for

పాత కాలం నాటి 'ఫుడ్ & క్యాలరీ' ఫార్ములా వద్దు!

ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన అతిపెద్ద డిమాండ్ కనీస బేసిక్ శాలరీ పెంపు గురించే. ప్రస్తుతం వేతనాలను లెక్కించడానికి వాడుతున్న పాత పద్ధతులు నేటి కాలానికి ఏమాత్రం సరిపోవడం లేదని ఆల్ ఇండియా ఎన్పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AINPSEF) స్పష్టం చేసింది. గతంలో కేవలం ఆహారం, బట్టలు, నివాసం లాంటి ప్రాథమిక అవసరాలు, కుటుంబానికి 3,490 క్యాలరీల ఫుడ్ ఫార్ములా ఆధారంగా కనీస వేతనాన్ని లెక్కించేవారు.

కానీ నేటి డిజిటల్ కాలంలో పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రైవేట్ హెల్త్‌కేర్, ఇంటర్నెట్, రవాణా ఖర్చులు , వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే ఇప్పటివరకు ఉన్న 'మూడు వినియోగ యూనిట్ల' (3-family-unit) ఫార్ములాను తీసేసి, ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా 'ఐదు యూనిట్ల' ఫార్ములాను తీసుకురావాలని కమిషన్‌ను కోరారు.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డీఏ (DA) విలీనంపై రచ్చ

కొత్త పే కమిషన్ వచ్చిన ప్రతిసారీ జీతాల పెంపును నిర్ణయించే 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' (Fitment Factor) పైనే పెద్ద చర్చ జరుగుతుంది. 7వ వేతన సంఘంలో ఇది 2.57 గా ఉంది. అయితే ప్రస్తుత ద్రవ్యోల్బణం, పెరిగిన జీవన వ్యయాన్ని బట్టి దీనిని 3.83 కి పెంచాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (IRTSA) మరో భిన్నమైన ప్రతిపాదన పెట్టింది. అందరికీ ఒకే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కాకుండా, వేర్వేరు పే-లెవెల్స్ ఉన్న ఉద్యోగులకు వేర్వేరుగా ఉండాలని సూచించింది.

దీనితో పాటు, ప్రస్తుతం 60% కి చేరిన డియర్నెస్ అలవెన్స్ (DA) ను కొత్త పే స్ట్రక్చర్ అమలు చేయడానికి ముందే బేసిక్ శాలరీలో విలీనం (Merge) చేయాలని నేషనల్ కౌన్సిల్ జెసిఎమ్ (NC-JCM) డిమాండ్ చేసింది. దీనివల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి పడిపోకుండా ఉంటుందని పేర్కొంది.

పెన్షన్ల పంచాయితీ: ఓపీఎస్, ఎన్పీఎస్, యూపీఎస్!

జీతాల పెంపుతో పాటు పెన్షన్ విధానంలో సంస్కరణలు కూడా ఈసారి 8వ వేతన సంఘం (8th pay commission) ముందు ఒక పెద్ద సవాలుగా నిలిచాయి. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కంటే, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించడమే ఉద్యోగులకు నిజమైన రిటైర్మెంట్ సెక్యూరిటీని ఇస్తుందని AINPSEF వాదిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) తో పాటు ఇతర పెన్షన్ రక్షణలపై కూడా బలమైన రక్షణ కల్పించాలని సంఘాలు కోరాయి.

ప్రతిపాదనల దశ ముగియడంతో, ఇకపై కమిషన్ విభిన్న నగరాల్లో (ముఖ్యంగా కోల్‌కతా వంటి ప్రాంతాల్లో) ఉద్యోగ సంఘాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి తుది సిఫార్సులను సిద్ధం చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+