కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్! మీ జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు పెరగనున్నాయి. రిటైర్డ్ జస్టిస్ రంజన దేశాయ్ నేతృత్వంలోని 8వ వేతన సంఘం (8th pay commission) ఇప్పటికే ఈ పని మొదలుపెట్టింది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
ఈ కమీషన్ లో ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకం కానుంది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ అంటే జీతం ఎంత పెరుగుతుందో తేల్చే గణాంకం. పాత బేసిక్ శాలరీని ఎంత మేరకు పెంచాలో ఈ ఫ్యాక్టర్ ను బట్టి నిర్ణయిస్తారు. నిపుణుల అంచనా ప్రకారం, ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మినిమమ్ 1.83 నుంచి గరిష్టంగా 2046 వరకూ ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక ఉద్యోగికి బేసిక్ శాలరీ రూ. 18,000 ఉంటే కొత్త బేసిక్ శాలరీ రూ.32,940 (18,000 x 1.83) నుంచి రూ. 44,280 (18,000 x 2.46) మేరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే.. జీతం అంత ఎక్కువగా పెరుగుతుంది. వేతన సంఘం నివేదికను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయానికి వస్తుంది.
బెనిఫిట్ ఎవరికంటే..
ఈ నిర్ణయంతో సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు బెనిఫిట్ పొందుతారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే, కేవలం బేసిక్ జీతం మాత్రమే కాదు డీఏ (DA ), పెన్షన్, హెచ్‌ఆర్‌ఏ (HRA), టిఏ (TA) వంటి ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఉద్యోగులతోపాటు వారి కుటుంబాలు, సీనియర్ సిటిజన్లు కూడా దీనివల్ల లాభం పొందుతారు.

సామాన్యులపై ప్రభావం ఎలా ఉంటుంది?
ఉద్యోగులకు జీతం పెరిగినా దాని ప్రభావం దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలపై కూడా ఉంటుంది. ఎలాగంటే.. ఉద్యోగులకు జీతం పెరగడం ద్వారా ఆర్థిక మార్కెట్లో ఖర్చు చేసే సామర్థ్యం పెరుగుతుంది. ఇది ఓవరాల్ గా ఆర్థిక వ్యవస్థకు బలాన్ని ఇస్తుంది. అంటే జీతాలు పెరిగితే ఉద్యోగులు ఎక్కువ ఖర్చు చేస్తారు. దుకాణాలు, మార్కెట్లు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు డిమాండ్ పెరుగుతుంది. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థకు మంచి బూస్ట్ ఇస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్‌కు కూడా డిమాండ్ పెరుగుతుంది. చేతికి ఎక్కువ డబ్బు వస్తే చాలా కుటుంబాలు ఇల్లు కొనుగోలు చేయడానికి లేదా పెద్ద ఇళ్లకు అద్దెకు మారడానికి ఆసక్తి చూపుతాయి. ఇది హౌసింగ్, రియల్ ఎస్టేట్ రంగానికి లాభం చేకూరుస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఇలా..
చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద నగరాల కంటే చిన్న పట్టణాలు, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారి పెరిగిన ఖర్చు వల్ల స్థానిక మార్కెట్లు బలపడతాయి, చిన్న వ్యాపారాలకు మద్దతు లభిస్తుంది. 65 లక్షలకు పైగా పెన్షనర్లకు పెన్షన్ పెరిగితే వృద్ధులపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.
వస్తువుల ధరలు మారొచ్చు..
మార్కెట్లోకి ఎక్కువ డబ్బు చలామణి అయినప్పుడు కొన్నిసార్లు ద్రవ్యోల్బణం (Inflation) కూడా పెరగొచ్చు. దీనివల్ల వస్తువుల ధరలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది జీతం పెంపు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.
8వ వేతన సంఘం నివేదికపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వేతనాల పెంపుతో కోట్ల మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపే ఈ నిర్ణయంపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications