కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త! త్వరలో మీ జీతాలు పెరగనున్నాయి. అయితే ఎంతమేరకు పెరుగుతాయి అన్నదే ఇప్పుడు ప్రశ్న. 8వ పే కమిషన్ రాకతో తమ జీతాలు, పెన్షన్లు ఎంత పెరుగుతాయో అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్ ఛైర్మన్, సభ్యులను నియమించి.. నిబంధనలను ప్రకటించినప్పటి నుంచి వీటిపై ఊహాగానాలు పెరిగాయి. ఇంతకీ శాలరీ ఎంత పెరుగుతుందంటే..

8వ పే కమిషన్ లో శాలరీ పెంపుని నిర్ణయించే ముఖ్యమైన అంశం - ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. ఇది ఒక మల్టిప్లయర్ నెంబర్.ఈ నెంబర్ ఆధారంగా మీ శాలరీ ఎంత పెరుగుతుందో తెలుసుకోవచ్చు. అయితే ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఎలా నిర్ణయిస్తారు? 8వ పే కమిషన్ దీనిని ఎంతగా ప్రకటించే అవకాశం ఉంది? ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలా నిర్ణయిస్తారు?
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది పాత బేసిక్ పే (Basic Pay) ను కొత్త బేసిక్ పే లెవెల్‌కు మార్చడానికి ఉపయోగించే సంఖ్య. దీనిని ఏ కమిషన్ కూడా ఒక స్థిరమైన ఫార్ములా ప్రకారం లెక్కించదు. రకరకాల ఆర్థిక అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, పే కమిషన్ దీనిని నిర్ణయిస్తాయి.
ప్రభావితం చేసే అంశాలు:
- ద్రవ్యోల్బణం (Inflation) & కాస్ట్ ఆఫ్ లివింగ్ : ద్రవ్యోల్బణం పెరిగితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. దీనికోసం కమిటీలు సాధారణంగా వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) ట్రెండ్‌లను పరిశీలిస్తాయి.
- ఆర్థిక సామర్థ్యం (Fiscal Capacity): ప్రభుత్వ ఖర్చుల పరిమితులు, బడ్జెట్ లభ్యతను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
- ప్రైవేట్ రంగంలో జీతాలతో పోలిక: మార్కెట్‌లో ఇతర సంస్థలు ఇస్తున్న జీతాలను పరిశీలించి తగినట్టుగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తారు.
- నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ రూపకల్పనలో స్థిరమైన ఫార్ములా లేనప్పటికీ ద్రవ్యోల్బణం, మార్కెట్ సర్దుబాటు వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.
గత పే కమిషన్లలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత?
గతంలో వచ్చిన పే కమిషన్లను ఒకసారి పరిశీలిస్తే.. 6వ CPCలో 1.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ను అమలు చేశారు. 24% డీఏ, 50% డీపీని విలీనం చేసి కొంత పెరుగుదలను అమలు చేశారు. 7వ CPC లో 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలు చేశారు. 125% డీఏను విలీనం చేసిన తర్వాత, ఉద్యోగులకు కనీసం 14% నిజమైన పెంపు (Real Hike) ఉండేలా చూశారు.
ఈసారి ఎంత ఉండవచ్చు?
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై కేంద్ర కేబినెట్ దే తుది నిర్ణయం అయినప్పటికీ.. వివిధ నివేదికలు, ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారం.. 8వ పే కమిషన్‌లో ఇది 2.0 నుంచి 2.57 మధ్య ఉండే అవకాశం ఉంది. ఆల్ ఇండియా ఎన్‌పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్ గారి లెక్కల ప్రకారం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కనీసం 2.13 ఉండవచ్చు. కమిషన్ నివేదిక సమర్పించే సమయానికి అంచనా వేసిన డీఏ (సుమారు 58% + అంచనా 7%) మరియు రెండు వార్షిక ఇంక్రిమెంట్లు (3.5% చొప్పున 7%) కలుపుకుంటే, ప్రస్తుత బేసిక్ పే దాదాపు 20% పెరిగే అవకాశం ఉంది. ఇది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 1.58 నుంచి 1.78కి పెంచుతుంది.
జీతంపై ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రభావం ఎంత?
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్.. మీ పాత బేసిక్ శాలరీని కొత్త బేసిక్ శాలరీగా మారుస్తుంది. పాత బేసిక్ పేని ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ నెంబర్ తో గుణిస్తే కొత్త బేసిక్ శాలరీ వస్తుంది. ఉదాహరణకు పాత బేసిక్ పే రూ.18,000 ఉంటే.. దాన్ని 1.8 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ తో గుణిస్తే.. రూ. 32,940 కొత్త బేసిక్ పే అవుతుంది. ఏదైమైనా ఈసారి 7వ పే కమిషన్ (2.57) కన్నా మెరుగైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లు కూడా అదే ఆశతో ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications