8వ పే కమిషన్.. 73 డిమాండ్లతో BPMS ఉద్యోగుల భారీ ప్రతిపాదనలు.. కొత్త డిమాండ్లు ఏంటంటే..

8th Pay Commission Big Update: ఎనిమిదో వేతన సంఘం ముందు రక్షణ రంగ పౌర ఉద్యోగుల సమాఖ్య అయిన భారతీయ ప్రతిరక్షా మజ్దూర్ సంఘ్ (BPMS) మొత్తం 73 డిమాండ్లతో కూడిన విస్తృత ప్రతిపాదనలను సమర్పించింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, బీమా రక్షణ, సెలవుల నిబంధనలలో కీలక సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ రూపొందించిన ఈ జాబితాలో ప్రస్తుత వార్షిక వేతన వృద్ధిని రెట్టింపు చేసి 6 శాతానికిపెంచడం, గ్రూప్ బీమా కవరేజీని రూ. 15 లక్షలకు పెంపు..పాత పెన్షన్ పథకాన్ని (OPS) పునరుద్ధరించడం వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి.

వేతనాలు, పెన్షన్ల నిర్మాణంలో సమూల మార్పులు చేయాలని బీపీఎంఎస్ కోరింది. ప్రస్తుతం ఉన్న 3 శాతం వార్షిక ఇంక్రిమెంట్‌ను 6 శాతానికి పెంచడం వల్ల పెరుగుతున్న జీవన వ్యయాలను తట్టుకుంటూ ఉద్యోగుల ఆదాయం సర్వీసు కాలంలో మెరుగ్గా వృద్ధి చెందుతుందని సమాఖ్య పేర్కొంది. అలాగే కనీస మూల వేతనాన్ని కుటుంబ వినియోగ అవసరాలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిబంధనలు మరియు ఆక్రాయిడ్ సూత్రం ఆధారంగా పునర్నిర్ణయించాలని.. గరిష్ఠ-కనిష్ఠ వేతన నిష్పత్తిని 1:10 మించకుండా పరిమితం చేయాలని ప్రతిపాదించింది.

8th Pay Commission 2026 BPMS 73 demands 8th CPC latest news 6 annual increment Old Pension Scheme restoration 15 lakh insurance cover central government employees salary 8th Pay Commission demands DA merger with basic pay 45 days paternity leave five financial upgradations defence civilian employees 8 8 73 6 15

కొత్త వేతన, పెన్షన్ నిర్మాణాలను ఖరారు చేసే ముందే ప్రస్తుత కరువు భత్యంలో (DA) 50 శాతాన్ని మూల వేతనం,పెన్షన్‌లో విలీనం చేయాలని, జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS), యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) లను నిలిపివేసి నిర్వచిత ప్రయోజనం కలిగిన పాత పెన్షన్ పథకాన్ని (OPS) తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేసింది.

Also Read

బీమా, బోనస్, ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాల విషయంలోనూ పలు కీలక మార్పులను బీపీఎంఎస్ సూచించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (CGEGIS) కింద ఉన్న బీమా రక్షణను ప్రస్తుతం ఉన్న రూ. 30,000 నుండి కనీసం రూ. 15 లక్షలకు పెంచాలని, డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని రూ. 10 లక్షలకు పెంచాలని కోరింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) పై వడ్డీ రేటు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వడ్డీ రేటు కంటే తక్కువ కాకుండా చూడాలని.. అడ్-హక్ బోనస్, ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ లను ఉన్నతాధికారులతో సహా అందరికీ వర్తింపజేసి కనీసం 30 రోజుల వేతనం ప్లస్ డీఏ మేర చెల్లించాలని ప్రతిపాదించింది.

ఉద్యోగుల కెరీర్ పురోగతి, పని-జీవిత సమతుల్యత, భద్రతకు సంబంధించి కూడా ఈ 73 ప్రతిపాదనలలో ప్రత్యేక అంశాలను చేర్చారు. మాడిఫైడ్ అష్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెషన్ (MACP) పథకం కింద 30 ఏళ్ల సర్వీసులో కనీసం ఐదు ఆర్థిక ఉన్నతీకరణలు కల్పించాలని, ఖాళీలతో సంబంధం లేకుండా అర్హత, అనుభవం ఆధారంగా పదోన్నతులు కల్పించే డైనమిక్ ప్రమోషన్ విధానాన్ని తీసుకురావాలని కోరింది. ప్రమాదకర పరిస్థితులలో పనిచేసే ఉద్యోగులకు నెలకు రూ. 10,000 వరకు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని, విధుల్లో ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగుల కుటుంబాలకు రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేసింది.

వీటితో పాటు పితృత్వ సెలవును 45 రోజులకు పెంచడం, మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా ఒక రోజు రుతుక్రమ సెలవు, పూర్తి వేతనంతో రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్, ఏటా 12 సాధారణ సెలవులు మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పిల్లల విద్యా భత్యం (CEA) పొడిగింపు వంటి సంక్షేమ ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉద్యోగ సంఘం సమర్పించిన ప్రతిపాదనలు మాత్రమేనని, వీటిని 8వ వేతన సంఘం పరిశీలించి తన నివేదికను సమర్పించిన తర్వాత ప్రభుత్వ ఆమోదంపైనే తుది నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని స్పష్టమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+