హెల్త్ సూపర్ సేవర్ పేరుతో ఫ్యూచర్ జనరలీ ఇండియా ఇన్సురెన్స్ (FGII) కొత్త వైద్య బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చింది. పాలసీ అమలులోకి వచ్చిన అనంతరం మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే తదుపరి సంవత్సరాల్లో చెల్లించే ప్రీమియం 80 శాతం తగ్గించడం ఈ పాలసీ ప్రత్యేకత. పాలసీలో రెండు వేరియంట్లు ఉన్నాయి.
మొదటి ఏడాది క్లెయిమ్ చేయకపోతే ఆ తర్వాత ఏడాది అప్లికెబుల్ ప్రీమియంలో 80 శాతం డిస్కౌంట్ ఉంటుంది. రెండో దానిని మొదటి రెండేళ్లలో క్లెయిమ్ చేయకుంటే తర్వాత రెండేళ్లలో 80 శాతం రాయితీ ఉంటుంది. లేదంటే మొదటి క్లెయిమ్ చేసే వరకు కొనసాగుతుంది.

హెల్త్ సూపర్ సేవర్ పాలసీ
FGII 3 లక్షలకు పైగా ఆరోగ్య బీమా వినియోగదారులను కలిగి ఉంది. కస్టమర్లను పెంచుకునే లక్ష్యంలో భాగంగా ఈ ఆకర్షణీయ ఆఫర్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. హెల్త్ సూపర్ సేవర్ పాలసీ మొదటి సంవత్సరం ఎలాంటి క్లెయిమ్ చేయకుంటే రెండు, మూడో సంవత్సరం పునరుద్ధరణ ప్రీమియంలో 80 శాతం తగ్గింపును అందిస్తుందని FGII మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనూప్ రావ్ అన్నారు.

అందరికీ వర్తిస్తుంది...
ఈ ఇన్సురెన్స్ కంపెనీ 1x, 2x అనే రెండు వేరియంట్లలో అందిస్తోంది. మొదటి వేరియంట్‌లోని వినియోగదారులకు మొదటి సంవత్సరంలో నో-క్లెయిమ్ బోనస్‌గా తదుపరి సంవత్సరాల్లో ప్రీమియంపై 80 శాతం తగ్గింపు ఇవ్వబడుతుంది. రెండో వేరియంట్లో బీమా చేసిన మొత్తం ఆధారంగా 80 శాతం ఎక్కువ కవరేజ్ కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఉత్పత్తి 70 సంవత్సరాల సీనియర్ నుండి ఒకరోజు నవజాత శిశువు వరకు వర్తిస్తుంది.

డైరెక్ట్ ప్రీమియం కలెక్షన్స్
ఇదిలా ఉండగా, నాన్-లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీల గ్రాస్ డైరెక్ట్ ప్రీమియం కలెక్షన్ జనవరి నెలలో 6.7 శాతం పెరిగి రూ.18,488.06 కోట్లకు చేరుకుంది. ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (irda) ప్రకారం అన్ని నాన్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలు గత ఏడాది ఇదే నెలలో డైరెక్ట్ ప్రీమియం రూ.17,333.70 కోట్లు జమచేశాయి. డేటా ప్రకారం 25 జనరల్ ఇన్సురెన్స్ కంపెనీలు 2021 మొదటి నెలలో తమ సామూహిక ప్రీమియంలో 10.8 శాతం పెరుగుదల నమోదు చేసి 2020 జనవరిలో 14,663 కోట్ల నుండి 16,247 కోట్లకు చేరుకున్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications