ముంబై: గతవారం టాప్ 10 కంపెనీల్లోని ఎనిమిది దిగ్గజ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పడిపోయింది. వీరి మార్కెట్ క్యాప్ రూ.1,57,277.53 మేర క్షీణించింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పడిపోయింది. గత వారం సెన్సెక్స్ ఏకంగా 1,457.16 పాయింట్లు (3.83 శాతం) మేర క్షీణించింది. లాభపడిన కంపెనీల్లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాత్రమే లాభపడ్డాయి. ఈ రెండు కూడా ఐటీ సంస్థలు కావడం గమనార్హం. మిగతా ఎనిమిది కంపెనీలు పెద్ద మొత్తంలో నష్టపోయాయి. గత వారంలో గురువారం ఒక్కరోజే సెన్సెక్స్ 1,100 పాయింట్లకు పైగా నష్టపోగా, మరుసటి రోజు శుక్రవారం 800 పాయింట్లకు పైగా లాభపడి ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది.

70వేల కోట్లు పడిపోయిన మార్కెట్ క్యాప్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.70,189.95 కోట్లు క్షీణించింది. దీంతో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ రూ.14,88,797.82 కోట్లకు పడిపోయింది.
- భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.31,096.67 క్షీణించి రూ.2,39,880.86కు పడిపోయింది.
- ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,752.95 కోట్లు క్షీణించి రూ.2,40,329.93కు పడిపోయింది.
- హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాప్ రూ.12,737.66 కోట్లు పడిపోయి రూ.2,96,339.09 కోట్లుగా ఉంది.
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఎం-క్యాప్ రూ.10,675.53 తగ్గి రూ.9,08,940.15 కోట్లకు చేరుకుంది.
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.7,286.42 కోట్లు పడిపోయి రూ.5,74,614.23 కోట్లుగా ఉంది.
- కొటక్ మహీంద్ర బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.5,710.01 కోట్లు తగ్గి రూ.2,47,292.12కు పడిపోయింది.
- హిందూస్తాన్ యూనీ లీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,828.34 క్షీణించి రూ.4,88,179.05 కోట్లుగా ఉంది.

ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ జూమ్
- ఈ వారం మొత్తంలో గురువారం మినహా మిగతా రోజుల్లో ఐటీ స్టాక్స్ లాభాలు నమోదు చేశాయి.
- హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,450.79 పెరిగి రూ.2,24,555.79కు పెరిగింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.3,622.14 పెరిగి రూ.4,30,647.81 కోట్లకు పెరిగింది.

రిలయన్స్ టాప్
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ టెన్ కంపెనీల్లో వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS, HDFC బ్యాంకు, HUL, ఇన్ఫోసిస్, HDFC, కొటక్ మహీంద్ర బ్యాంకు, ICICI బ్యాంకు, ఎయిర్‌టెల్, HCL టెక్నాలజీస్ ఉన్నాయి. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.14 లక్షల కోట్లకు పైగా, టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.9 లక్షల కోట్లకు పైగా ఉంది.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications