స్టాక్ మార్కెట్‌లో సోమవారం అనూహ్యంగా చురుకుదనం కనిపించింది. ఈ షేర్ ఒక్కరోజులోనే 8% కంటే ఎక్కువ పెరిగి, గత 4 నెలల్లో చూడని గరిష్ఠ స్థాయిని తాకింది. BSEలో ఒక్కో షేర్ ధర రూ. 8.30 వరకు వెళ్లింది. భారీగా కొనుగోలు, అమ్మకాలతో ట్రేడింగ్ పెరగడంతో పెట్టుబడిదారులంతా ఈ షేర్ పైనే దృష్టి పెట్టారు. ఈ ఆకస్మిక ర్యాలీకి ప్రధాన కారణం ఏమిటంటే రాబోయే సెప్టెంబర్ 19 శుక్రవారం ముందు విచారణకు రానున్న కీలక కేసు. అదే ఈ పెరుగుదలకి మూలం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

కంపెనీ పిటిషన్ ఏమిటి?
వోడాఫోన్ ఐడియా కంపెనీపై DoT అదనంగా రూ. 9,450 కోట్ల AGR బకాయిలను విధించింది. దీన్ని రద్దు చేయాలని కోరుతూ కంపెనీ సెప్టెంబర్ 8న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కంపెనీ చెబుతున్నదేమిటంటే, ఈ బకాయిల లెక్కల్లో కొన్ని పొరపాటున రెండుసార్లు లెక్కించబడ్డాయని చెప్పింది. అలాగే, 2017కి ముందున్న కాలానికి సంబంధించిన బకాయిలను మళ్లీ లెక్కించాలన్న డిమాండ్ చేసింది. అంతేకాకుండా, ఈ లెక్కలు సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన AGR తీర్పు పరిధిని మించి ఉన్నాయని కూడా కంపెనీ వాదిస్తోంది.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ (DoT) మాత్రం ఈ అదనపు బకాయిలు మళ్లీ లెక్కించడం వల్ల వచ్చినవి కావని అంటోంది. పాత ఆర్థిక సంవత్సరాల ఖాతాలను పూర్తి చేసిన తర్వాతే ఈ తేడా బయట పడిందని వివరిస్తోంది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో, FY18-19 కాలానికి సంబంధించిన రూ. 2,774 కోట్లు (ఇవి విలీనం తర్వాత వోడాఫోన్ ఐడియాకి చెందినవి) మరియు విలీనం ముందు వోడాఫోన్ గ్రూప్ కి చెందిన రూ. 5,675 కోట్లు బకాయిలుగా చూపించింది.
ఈ కేసు ఫలితం భవిష్యత్తుకి చాలా కీలకం. కంపెనీ ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉంది. అయినప్పటికీ నిధులు సమీకరించి మార్కెట్‌లో తన స్థానం బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. గత ఒక నెలలో ఈ షేర్ "35% వరకు పెరిగింది", కానీ ఈ ఏడాది ఇప్పటివరకు మాత్రం కేవలం 3% మాత్రమే పెరిగింది.
సుప్రీంకోర్టు తీర్పు రాకముందే పెట్టుబడిదారులు భారీగా షేర్లు కొనుగోలు చేస్తున్నారని, అందుకే ఒక్కసారిగా షేర్ ధర ఎగబాకిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
పెట్టుబడిదారుల దృష్టిలో ప్రస్తుతం కంపెనీపై AGR బకాయిలు రద్దు అయ్యే అవకాశం ఒక పెద్ద ఫ్యాక్టర్గా ఉంది. ఇది జరిగితే వోడాఫోన్ ఐడియా భవిష్యత్తుకు ఊరటగా ఉంటుంది అని చాలా మంది పెట్టుబడిదారులు భావిస్తున్నారు. అందుకే, ఈ ఊహతోనే పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు షేర్లను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారి ఎక్కువగా షేర్ల డిమాండ్ పెరగడం వల్ల, షేర్ ధర ఒకసారిగా స్కైరాకింగ్ అయ్యి, ఒక్క రోజులోనే 8% కంటే ఎక్కువ పెరిగింది. పెట్టుబడిదారుల కోసం ఇది ఒక సరైన సమయంగా కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చిన్న పెట్టుబడిదారులూ కూడా AGR రద్దు అవుతుందేమో అని ఊహాగానాలతో షేర్లను కొనుగోలు చేస్తూ, ఈ ఆకస్మిక స్పైక్ కి కారణమవుతున్నారు.
More From GoodReturns

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

ఆర్బీఐ కీలక నిర్ణయం: మార్కెట్లలో భారీ కదలికలు ఖాయమా?

ఆర్బీఐ నిర్ణయం.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాకా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!



Click it and Unblock the Notifications