ఈపీఎఫ్ఓలో డిసెంబర్ 2023లో 8.41 లక్షల మంది కొత్త సభ్యులు చేరారు. ఇందుకు సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నివేదిక విడుదల చేసింది. ఇది గత మూడు నెలల్లో అత్యధికం. నవంబర్ 2023తో పోల్చితే కొత్త సభ్యుల చేరిక 14.21 శాతం పెరిగింది. గత నెల నవంబర్ 2023తో పోలిస్తే ప్రస్తుత నెలలో నికర సభ్యుల చేరికలో 11.97 శాతం పెరుగుదల నమోదు అయింది.
ఈ మెంబర్‌షిప్ పెరుగుదలకు ఉపాధి అవకాశాలు పెరగడం, ఉద్యోగి ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహన కారణమని చెబుతున్నారు.డిసెంబర్‌లో చేరిన మొత్తం కొత్త సభ్యులలో 57.18 శాతం మంది 18-25 ఏళ్ల మధ్య ఉన్నవారు ఉన్నారు. వ్యవస్థీకృత వర్క్‌ఫోర్స్‌లో చేరిన వ్యక్తులలో ఎక్కువ మంది యువత, ప్రధానంగా మొదటి సారి ఉద్యోగార్ధులుగా ఉన్నారు. కాగా అదే నెలలో దాదాపు 12.02 లక్షల మంది సభ్యులు నిష్క్రమించారు.

ఈ సంఖ్య నవంబర్ 2023 మునుపటి నెలతో పోలిస్తే గణనీయమైన 12.61 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత ఐదు నెలల్లో ఇది అత్యధికంగా ఉంది. ఇక కొత్తగా చేరిన 8.41 లక్షల మందిదాదాపు 2.09 లక్షల మంది మహిళా సభ్యులు ఉన్నారు. ఈ సంఖ్య గత మూడు నెలల్లో అత్యధికంగా మహిళా శ్రామికశక్తిని నమోదు చేసింది. అంతకు ముందు నవంబర్ 2023 నెలతో పోల్చితే 7.57 శాతం పెరుగుదల కనిపించింది.
రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా నుంచి ఎక్కువ మంది పీఎఫ్ లో సభ్యులు గా చేరారు. ఈ రాష్ట్రాలు నికర సభ్యుల చేరికలో దాదాపు 58.33 శాతంగా ఉన్నాయి. ఈ నెలలో మొత్తం 9.11 లక్షల మంది నికర సభ్యులను జోడించారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications