న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఏడో వేతన సవరణ సంఘం (7th Pay Commission) సమావేశం ఖరారైంది. ఏడాదిన్నర కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance-DA), డియర్‌నెస్ రిలీఫ్ (Dearness Relief-DR)పై చర్చించడానికి ఈ నెల 26వ తేదీన అధికారిక భేటీ ఏర్పాటు కానుంది. ఈ సమావేశం విజయవంతమైతే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులు ఫలించినట్టే. వారికి అందాల్సిన డీఏ, డీఆర్ బకాయిల విడుదల తేదీ ఖరారవుతుంది.
ఈ నెల 26వ తేదీన ఏడో వేతన సవరణ సంఘం, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ (JCM) ప్రతినిధులు సమావేశం కానున్నారు. దేశవ్యాప్తంగా 52 లక్షల మంది వరకు ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 60 లక్షల వరకు ఉన్న పింఛన్‌దారులకు డీఏ, డీఆర్ బకాయిలపై ఈ సమావేశంలో చర్చిస్తామని జేసీఎం కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తెలిపారు. కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అధికారులు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్, జేసీఎం ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు.

గత ఏడాది జనవరి 1, అదే ఏడాది జులై 1, ఈ ఏడాది జనవరి 1వ తేదీల నుంచి చెల్లించాల్సిన బకాయిలపై సమగ్రంగా చర్చిస్తామని స్పష్టం చేశారు. ఏడో పే కమిషన్ సిఫారసుల ప్రకారం.. ఉద్యోగుల మూల వేతనంలో నాలుగు శాతం మేర పెంపు ఉంటుందంటూ జేసీఎం ఇదివరకే అంచనా వేసింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ప్రభావం వల్ల ఏప్రిల్ చివరివారంలో ప్రకటించాల్సిన డీఏ పెంపుదలను తొలుత మే, ఆ తరువాత జూన్‌కు వాయిదా వేసినట్లు ఆయా శాఖల అధికారులు తమకు సమాచారం ఇచ్చినట్లు మిశ్రా పేర్కొన్నారు. అయినప్పటికీ మళ్లీ వాయిదా పడిందని చెప్పారు.
డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌ను ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జాప్యం చేసిందని, ఈ ఏడాది జూన్ లేదా జులైల్లో డీఏను పునరుద్ధరిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఇదివరకే రాజ్యసభలో హామీ సైతం ఇచ్చిందని మిశ్రా గుర్తు చేశారు. వాటికి కేంద్రం కట్టుబడి ఉండాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. ఈ నెల 26వ తేదీ నాటికి అధికారిక భేటీకి సంబంధించిన అజెండాను ఇంకా నిర్ధారించలేదని పేర్కొన్నారు. గత ఏడాది జులై నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ద్రవ్యోల్బణం 3.5 శాతంగా నమోదైందని, దీన్ని ఆధారంగా చేసుకుంటే.. డీఏ పెంపు కనీసం నాలుగు శాతంగా ఉండొచ్చని తాము అంచనా వేస్తున్నట్లు శివ గోపాల్ మిశ్రా తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications