Mutual Funds: నిండా ముంచుతున్న మ్యూచువల్ ఫండ్స్.. మీరు పెట్టుబడి పెడుతున్నారా..!
ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్లు అంటే చాలా మందికి తెలియదు. కానీ రాను రాను మ్యూచువల్ ఫండ్లపై చాలా మందికి అవగాహన ఏర్పడింది. అయితే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది. నెగెటివ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. 2025-26లో 731 మ్యూచువల్ ఫండ్లు నెగెటివ్ రాబడి ఇచ్చాయి. అంటే మ్యూచువల్ ఫండ్ల చాలా దారుణంగా పని చేస్తున్నాయి. చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో భారీగా లాభం వస్తుందని పెట్టుబడి పెడతారు. కానీ అందులో రిస్క్ మాత్రం అర్థం చేసుకోరు. 12 శాతం నుంచి 15 శాతం రాబడి వస్తుందని చాలా అనుకుంటారు. అయితే అన్ని మ్యూచువల్ ఫండ్లలో ఇలా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో చాలా మ్యూచువల్ ఫండ్లు నెగెటివ్ రాబడి ఇస్తున్నాయి. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ (SEBI) విడదల చేసిన తాజా గణాంకాల ప్రకారం చాలా మ్యూచువల్ సరిగా ఫర్మామ్ చేయడం లేదని తెలుస్తోంది. అందుకే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. మొత్తం 1841 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లలో దాదాపు 40 శాతం అంటే 731 ఫండ్లు నెగెటివ్ రాబడి ఇచ్చాయి. 2024-25 సంవత్సరంలో నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చి ఫండ్ల సంఖ్య 243గా ఉంది. అంటే వీటి సంఖ్య ఇప్పుడు పెరిగింది. వివిధ రకాల ఫండ్లు మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడులు గణనీయంగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడిదారులు ప్రతి సంవత్సరం 12-15 శాతం రాబడులను ఆశించవద్దని చెబుతున్నారు.

2025-26లో మ్యూచువల్ ఫండ్ పథకాలన్నింటిలోనూ రెండంకెల రాబడి రాలేదు. కేవలం 198 పథకాలు మాత్రమే ఏడాది కాలంలో 10 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి. మార్కెట్ మందగించి రాబడులు తగ్గినప్పటికీ భారతీయులు మ్యూచువల్ ఫండ్లపై ఉంచిన నమ్మకం తగ్గలేదు. మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు పెంచుతూనే ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో నిధుల విలువ గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం భారీగా పెరిగింది. నెలవారీ ఎస్ఐపీ (SIP) ద్వారా పెట్టుబడులు పెట్టే ఖాతాల సంఖ్య 10.45 కోట్లకు పెరిగింది. మ్యూచువల్ ఫండ్లలో షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే రాబడి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మ్యూచువల్ ఫండ్ రాబడి పెట్టుబడి పెట్టిన ఫండ్ పై ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లలో 5 నుంచి 8 సంవత్సరాలు పెట్టుబడి పెడితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కొన్ని సార్లు మ్యూచువల్ ఫండ్ల్ నెగెటివ్ రిటర్న్స్ ఇస్తాయని.. అప్పుడు కూడా భయపడకుండా పెట్టుబడి పెడితే ఎక్కువ యూనిట్లు వచ్చి.. మార్కెట్ పుంజుకుంటే భారీ రాబడి వస్తుందని పేర్కొంటన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications