కరోనా మహమ్మారి - లాక్ డౌన్ నేపథ్యంలో చాలామంది వృత్తి నిపుణులు, వేతన జీవులు తమ భవిష్యత్తు అవసరాలపై తీవ్ర ఆందోళనతో ఉన్నారని ప్రముఖ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ఇండియా లెండ్స్ సర్వేలో వెల్లడైంది. కరోనా కారణంగా తీవ్రఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చునని చాలామంది చెప్పారు. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 5,000 మంది వేతనజీవులు పాల్గొన్నారు. ఈ సర్వేలో ఆందోళనకర అంశాలు వెల్లడయ్యాయి.

ఖర్చులు తగ్గించుకుంటాం, ప్లాన్ చేసుకుంటాం
82 శాతం మంది తమ కమిట్‌మెంట్స్‌ను తీర్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
94 శాతం మంది రాబోయే రోజుల్లో డబ్బులను ఎలా ప్లాన్‌గా ఖర్చు చేసుకోవాలనే అంశంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
84 శాతం మంది తాము ఖర్చులు తగ్గించుకుంటున్నట్లు తెలిపారు.
90 శాతం మంది తమ పొదుపు, ఆర్థిక భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

రుణాలు చెల్లించలేక.. పర్సనల్ లోన్
తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేందుకు, నిత్యావసరాలు, వైద్య, విద్య ఫీజులు, ఇంటి మరమ్మతులు, పునరుద్ధరణ వంటి ఖర్చుల కోసం తాము పర్సనల్ లోన్ తీసుకుంటామని 72 శాతం మంది చెప్పారు.
ఇందులో 71 శాతం మందికి ఇప్పటికే రుణాలు ఉండటం గమనార్హం.
45 శాతం మంది రుణాలు చెల్లించలేక మారటోరియం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
రిటైల్ రుణాలకు గిరాకీ పెరుగుతోంది.
76 శాతం మంది కొత్త పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని చెప్పారు.
ఎసెన్షియల్ ఐటమ్స్ పైన ఖర్చులు పెరుగుతాయని 40 శాతం మంది చెప్పారు.
వినోదం, లగ్జరీ, లైఫ్ స్టైల్ వంటి అనవసర ఖర్చులపై ఖర్చులు తగ్గిస్తామని 70 శాతం మంది చెప్పారు. అంటే సినిమాలు, టూర్లు వంటి వాటిపై ఖర్చులు తగ్గించే అవకాశముంది.

రిటైల్ రుణాలకు గిరాకీ
కరోనా మహమ్మారి మనమంతా పని చేసే విధానాన్ని మార్చి వేసిందని, వేతనజీవులు, వృత్తి నిపుణులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని ఇండియా లెండ్స్ వ్యవస్థాపకులు, సీఈవో గౌరవ్ చోప్రా వెల్లడించారు. కొంతమంది తమ ఉద్యోగాలు కోల్పోతే, ఎక్కువమందికి వారి వారి కంపెనీలు వేతనాల్లో కోత విధించినట్లు తెలిపారు. వారి ఆదాయం, పొదుపుపై ప్రభావం పడతోందని, దీంతో రిటైల్ రుణాలకు డిమాండ్ పెరుగుతోందన్నారు.

రుణ ఎంపికపై జాగ్రత్తగా ఉండాలి
ఆర్థిక విస్తరణ, ఆస్తులు సులభంగా అందుబాటులోలేని ఈ పరిస్థితుల్లో వ్యక్తులు వారి రుణ ఎంపికపై జాగ్రత్తగా ఉండాలని, ముందు ముందు ఎన్ని వారాలు, నెలలు పరిస్థితి ఎలా ఉంటుందో గమనించి ప్రణాళిక ప్రకారం, వ్యక్తిగత రుణం లేదా లైన్ ఆఫ్ క్రెడిట్ వైపు దృష్టి సారించాలని గౌరవ్ చోప్రా వెల్లడించారు.
రుణగ్రహీతల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని డిజిటల్ లెండర్ అప్లికేషన్ ఫామ్స్ ప్రక్రియను సులభతరం చేస్తున్నట్లు తెలిపారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications