దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్ నెట్‌వర్క్‌ను స్థాపించిన ఆదర్శనీయుడి కృషి భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగాన్నే మార్చేసింది. ఆయనే డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి. 92 ఏళ్ల వయసులో కూడా ఆయన ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసులోనే ఉంటారు. వారానికి ఆరు రోజులు పని చేసే డాక్టర్ రెడ్డిని చూస్తే ఆయన వయస్సు తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యపోతారు.

నేటికీ డాక్టర్ రెడ్డిలో ఉన్న శక్తి, పని పట్ల ఆయనకున్న అంకితభావం ఒక యువకుడికీ ఎ మాత్రం తక్కువ కాదు. ఆరోగ్య సేవ తనకు ఎంతో ఇష్టమని, దానిని నిరంతరం మెరుగుపరచాలని ఆయన ఎప్పుడూ కోరుకుంటుంటారు. 1983లో దేశంలోనే మొట్టమొదటి కార్పొరేట్ హాస్పిటల్ అయిన అపోలో హాస్పిటల్స్‌ను ప్రారంభించిన ఘనత డాక్టర్ రెడ్డిదే. అప్పట్లో మన దేశంలో సరైన ఆరోగ్య సౌకర్యాలు లేక చాలామంది చికిత్స కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది.
దింతో దేశంలోనే ప్రపంచ స్థాయి చికిత్సా సౌకర్యాలను అందించాలని డాక్టర్ రెడ్డి బలంగా అనుకున్నారు. ఆయన ఆలోచన భారతదేశ ఆరోగ్య రంగాన్ని శాశ్వతంగా మార్చేసింది. చెన్నైలో జన్మించిన డాక్టర్ రెడ్డి స్టాన్లీ మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో కార్డియాలజిస్ట్‌గా ట్రైనింగ్ పొందారు. 1970లో తన తండ్రి నుండి వచ్చిన ఒక లేఖతో ఆయనను భారతదేశానికి తిరిగి వచ్చేలా చేసింది. 1979లో సరైన ట్రీట్మెంట్ లభించక ఒక రోగి మరణించడం డాక్టర్ రెడ్డిని తీవ్రంగా కలచివేసింది. ఈ సంఘటనతోనే అపోలో హాస్పిటల్స్ ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారు. చికిత్స లేకపోవడం వల్ల ఇకపై ఎవరూ చనిపోకూడదనేది ఆయన ముఖ్య ధ్యేయం.
నేడు అపోలో హాస్పిటల్స్ కేవలం ఒక ఆసుపత్రి మాత్రమే కాదు, అదొక భారీ ఆరోగ్య సంరక్షణ సామ్రాజ్యం. అపోలో నెట్‌వర్క్‌కు దేశవ్యాప్తంగా 71 ఆసుపత్రులు 5 వేల కంటే ఎక్కువ ఫార్మసీలు, 291 ప్రైమరీ హెల్త్ కేర్ క్లినిక్‌లు, ఒక డయాగ్నస్టిక్ నెట్‌వర్క్ ఇంకా ఒక అత్యాధునిక డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ ఉన్నాయి. ఈ బృందం దేశంలోని ప్రతి మూలకూ నాణ్యమైన ఆరోగ్య సేవలను అందిస్తోంది. ఈ సౌకర్యాలను అపోలో గ్రూప్ ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంది. అపోలో హాస్పిటల్స్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.70 వేల కోట్లకు పైగా ఉంది. సి రెడ్డి కుటుంబానికి ఇందులో 29.3% వాటా ఉంది. ఫోర్బ్స్ ప్రకారం, డాక్టర్ రెడ్డి మొత్తం సంపద రూ.26,560 కోట్లు. అంత సంపద ఉన్నప్పటికీ ఆయన చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతారు.
విజయం మనల్ని మార్చాలని, దేశం కోసం మరింతగా పనిచేయడానికి ప్రేరణనివ్వాలని డాక్టర్ రెడ్డి బలంగా నమ్ముతారు. బిజినెస్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ "మన విజయాన్ని దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగించాలి' అని అన్నారు. 92 ఏళ్ల వయసులో కూడా డాక్టర్ రెడ్డి చూపించే ఉత్సాహం, ఆయన నాయకత్వం నిజంగా ప్రశంసనీయం. ఆయన జీవితం నుండి మనం నేర్చుకునే గొప్ప విషయం ఏమిటంటే మీకు ఏదైనా సాధించాలనే బలమైన పట్టుదల ఉంటే, మీ కలలు, లక్ష్యాలను చేరుకోవడానికి వయస్సు ఎప్పుడూ అడ్డురాదు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications