43 కోట్ల మందికి జన్ ధన్ అకౌంట్, రూ.1.46 లక్షల కోట్లు డిపాజిట్
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(PMJDY) పథకం ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ స్కీం కింద ప్రారంభమైన అకౌంట్లలో 86.3 శాతం యాక్టివ్‌గా ఉన్నాయి. 2015 ఆగస్ట్ నుండి 2020 ఆగస్ట్ మధ్య కాలంలో అకౌంట్స్ 2.3 శాతం పెరగగా, డిపాజిట్స్ 5.7 శాతం పెరిగాయి. PMJDY కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల సంఖ్య 43 కోట్లకు చేరుకుంది. వీటిలో డిపాజిట్స్ మొత్తం రూ.1.46 లక్షల కోట్లకు (146,230.71 కోట్లు) చేరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.
ఈ పథకం ప్రారంభమై ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్థిక శాఖ ఈ ప్రకటనను విడుదల చేసింది.ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(PMJDY) పథకం ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ స్కీం కింద ప్రారంభమైన అకౌంట్లలో 86.3 శాతం యాక్టివ్‌గా ఉన్నాయి. 2015 ఆగస్ట్ నుండి 2020 ఆగస్ట్ మధ్య కాలంలో అకౌంట్స్ 2.3 శాతం పెరగగా, డిపాజిట్స్ 5.7 శాతం పెరిగాయి. PMJDY
కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల సంఖ్య 43 కోట్లకు చేరుకుంది. వీటిలో డిపాజిట్స్ మొత్తం రూ.1.46 లక్షల కోట్లకు (146,230.71 కోట్లు) చేరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. ఈ పథకం ప్రారంభమై ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్థిక శాఖ ఈ ప్రకటనను విడుదల చేసింది.

ప్రధాని నరేంద్ర మోడీ 2014 ఆగస్ట్ 15వ తేదీన ప్రకటించిన ఈ పథకం అదే ఏడాది ఆగస్ట్ 28వ తేదీన ప్రారంభమైంది. ఈ ఏడాది ఆగస్ట్ 18 వరకు PMJDY ఖాతాల సంఖ్య 43.04 కోట్లకు చేరిందని, ఇందులో మహిళల ఖాతాలు 55.47 శాతమని (23.87 కోట్లు), చిన్నపట్లణాలు, గ్రామీణ ప్రాంతాల వారికి 66.69 శాతం (28.7 కోట్లు) ఖాతాలు ఉన్నాయని తెలిపింది. మొత్తం PMJDY ఖాతాల్లో 36.86 కోట్లు (85.6 శాతం) ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయని పేర్కొంది.
జన్ ధన్ అకౌంట్ ప్రారంభమైన ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఈ పథకం దేశ అభివృద్ధి నమూనాను సంపూర్ణంగా మార్చివేసిందని, కోట్లాదిమందికి సాధికారిత, గౌరవం కలిగించి సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి దోహదపడిందని, పారదర్శకతను తీసుకు వచ్చిందని పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న నిరుపేదలకు అభివృద్ధి ఫలాలు అందించేందుకు ఈ పథకం సహకరించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.


Click it and Unblock the Notifications