ఒక వ్యక్తి ఆర్థిక ప్రణాళికలో ఇన్సూరెన్స్ ఒక ముఖ్యమైన అంశం. ఊహించని సంఘటనలు జరిగినప్పుడు మీ ఖర్చులను నియంత్రించడంలో సహాయపడే బీమాకి మీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. లైఫ్ ఇన్సూరెన్స్ నుండి హెల్త్ ఇన్సూరెన్స్ వరకు వివిధ రకాల కవరేజీలు మిమ్మల్ని వివిధ పరిస్థితుల నుండి రక్షిస్తాయి. అయితే, బీమాను ఎంచుకునేటప్పుడు కొన్ని సాధారణ తప్పులు మీ ఆర్థిక భద్రతను ప్రభావితం చేస్తాయి. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు దాదాపు అందరూ చేసే సాధారణ తప్పులు ఏంటంటే...
*మీ ఇన్సూరెన్స్ అవసరాలను అంచనా వేయకపోవడం
మీ జీవితం, ఆరోగ్యం లేదా ఆస్తి రక్షణ అవసరాలను సరిగ్గా అంచనా వేయకుండా బీమాను కొనుగోలు చేయడం పెద్ద తప్పు.

ఉదాహరణకి ఒక వ్యక్తి తన కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమాను తీసుకున్నాడు అనుకుందాం... అయితే, మెట్రోపాలిటన్ నగరాల్లో ఆరోగ్య సంరక్షణ ఖర్చు చాలా ఎక్కువగా ఉండటం వలన అత్యవసర వైద్య పరిస్థితుల్లో ప్రతికూలతగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ప్రతి వ్యక్తికి రూ.25 లక్షల వరకు కవరేజ్ అందించే పాలసీ అవసరం.
తెలుసుకోవాల్సింది: మీ కుటుంబంలో ఎంత మంది, వారి ఆరోగ్య పరిస్థితి ఇంకా స్థానిక వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకుని సరిపోయే కవరేజీని అందించే పాలసీని సెలెక్ట్ చేసుకోవాలి.
*పాలసీలను పోల్చకపోవడం
మీ స్థానిక ఇన్సూరెన్స్ ఏజెంట్‌పై మాత్రమే ఆధారపడి పాలసీలను పోల్చకుండా పాలసీ కొనుగోలు చేయడం పెద్ద తప్పు. కొంతమంది ఏజెంట్లు అధిక కమిషన్ ఆధారంగా ఉండే పాలసీలను మాత్రమే సిఫార్సు చేయవచ్చు.
ఉదాహరణ: ఒక కుటుంబం ప్రీమియం ఎక్కువగా ఉన్న, కానీ పరిమిత ప్రయోజనాలు మాత్రమే కలిగిన పాలసీతో ఉంటుంది .
పరిష్కారం: ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో పాలసీలను పోల్చి చుడండి. దీని ద్వారా మీరు కవరేజ్, ప్రీమియం, ఫీచర్లు ఇంకా కనీస మినహాయింపులను అర్థం చేసుకోవడం ద్వారా బెస్ట్ పాలసీని సెలెక్ట్ చేసుకోవచ్చు. బీమా అనేది ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఉపయోగపడే సేవింగ్స్. క్లిష్ట పరిస్థితుల్లో ఇది ఒక అభయ హస్తం.


Click it and Unblock the Notifications