జూన్ నెలలో ఇప్పటి వరకు టాప్ 10 లార్జ్ క్యాప్ కంపెనీల స్టాక్స్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. దీంతో పాటు మరో ఎనిమిది కంపెనీల స్టాక్స్ 52వారాల గరిష్టానికి చేరుకున్నాయి. ఏడాది గరిష్టాన్ని తాకిన 8 కంపెనీల్లో ఏడు ఫార్మా రంగం నుండి ఉన్నాయి. బెంచ్ మార్క్ సూచీలు ఇప్పటికి జనవరి నాటితో పోలిస్తే ఇంకా 18 శాతం తక్కువగా ఉన్నాయి. టాప్ టెన్ కంపెనీల్లో ఎక్కువ వరకు గత మూడు నెలల్లో డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, దివిస్ ల్యాబ్స్ ముథూట్ ఫైనాన్స్, బయోకాన్, బేయర్స్, క్రాప్ సైన్స్, పీఐ ఇండస్ట్రీస్, కోరమండల్ ఇంటర్నేషనల్ వంటివి ఉన్నాయి.
దేశంలో అత్యధిక క్యాపిటలైజేషన్ కంపెనీగా రిలయన్స్ నిలిచింది. ఇది శుక్రవారం నాటికి రుణరహిత సంస్థగా ఏర్పడింది. ముఖేష్ అంబానీ 2021 మార్చి నాటికి డెబిట్ ఫ్రీ కంపెనీగా ఉండాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. కానీ పది నెలల ముందే ఆ టార్గెట్ అందుకున్నారు. మూడు నెలల్లో ఈ స్టాక్ రెట్టింపు అయింది. కంపెనీని రుణరహిత సంస్థగా తీర్చిదిద్దేందుకు 1.7 ట్రిలియన్ డాలర్లు సమీకరించింది.

ఇక, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఫార్మా స్టాక్స్ పైన ఆసక్తి కనబరిచారు. బయోకాన్, సింజీన్ ఇంటర్నేషనల్, దివిస్ ల్యాబ్స్ సహా పలు ఫార్మా కంపెనీలు ఉన్నాయి. 52 వారాల గరిష్టానికి చేరుకున్న లార్జ్ క్యాప్స్‌లలో జుబిలాంట్ లైఫ్ సైన్సెస్, కాడిలా హెల్త్ కేర్, లుపిన్, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, సిప్లా, టోరెంట్ పవర్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications