మోస్ట్ వ్యాల్యూడ్ టాప్ 10లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం పెరిగింది. ఈ ఏడు సంస్థల సంపద రూ.2 లక్షల కోట్లకు పైగా పెరిగింది. మరో మూడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గింది. ఎం-క్యాప్ పరంగా భారీగా ఎగిసిన సంస్థల్లో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందు ఉంది. వరుస పెట్టుబడులు, కోలుకుంటున్న చమురు ధరలు, దీనికి తోడు ప్రధానంగా షేర్ ధర అంతకంతకూ పెరగడం రిలయన్స్‌కు కలిసి వచ్చింది.

రూ.2 లక్షల కోట్లకు పైగా పెరిగిన మార్కెట్ క్యాప్
గత వారం ఏడు కంపెనీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,03,063.21 పెరిగింది. ఇందులో రిలయన్స్‌తో పాటు HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, HDFC, కొటక్ మహీంద్రా బ్యాంకు, ICICI బ్యాంకు, ITC ఉన్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గింది.

ఏ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ ఎంత పెరిగింది
ఆయిల్ టు టెలికం దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ఐదు సెషన్లలో రూ.1,48,880.91 కోట్లు పెరిగి రూ.13,60,562.99 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ రిటైల్‌లో అమెజాన్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉందనే వర్తల నేపథ్యంలో రిలయన్స్ షేర్స్ జూమ్ అన్నాయి.
ICICI బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.18,135.35 పెరిగి రూ.2,47,291.59 కోట్లకు,
HDFC బ్యాంకు రూ.10,788.4 పెరిగి రూ.6,14,252.37 కోట్లకు,
ఇన్ఫోసిస్ రూ.7,935.1 పెరిగి రూ.3,92,962.68 కోట్లకు,
ఐటీసీ మార్కెట్ వ్యాల్యుయేషన్ రూ.7,006.57 పెరిగి రూ.2,45,475.86 కోట్లకు పెరిగింది.
HDFC మార్కెట్ క్యాప్ రూ.6,062.45 పెరిగి రూ.3,19,332.15 కోట్లకు, కొటక్ మహీంద్రా బ్యాంకు ఎం-క్యాప్ రూ.4,254.43 కోట్లు పెరిగి రూ.2,67,118.80 కోట్లకు పెరిగింది.

తగ్గిన టీసీఎస్ ఎం-క్యాప్
HUL మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,040.44 కోట్లు తగ్గి రూ.5,19,191.82 కోట్లకు,
TCS మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,623.07 కోట్లు తగ్గి రూ.8,09,408.14 కోట్లకు,
భారతీ ఎయిర్‌టెల్ ఎం-క్యాప్ రూ.4,118.95 కోట్లు తగ్గి రూ.3,05,402.10 కోట్లకు తగ్గింది.
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ 10లో వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS, HDFC బ్యాంకు, HUL, ఇన్ఫోసిస్, HDFC, ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ICICI బ్యాంకు, ITC ఉన్నాయి.
గత వారం సెన్సెక్స్ 1,108.76 పాయింట్లు లేదా 2.99 శాతం పెరిగింది.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications