Upcoming IPOs: భారతీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో చాలా మంది ఇన్వెస్టర్లు ఈక్విటీల కంటే ఎక్కువగా ఐపీవోలపై ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఐపీవోలపై బెట్టింగ్ వేసేవారికి రానున్న వారం సైతం అనేక కంపెనీలు సదవకాశాన్ని కలిగిస్తున్నాయి. వీటికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే..
* ఇంటరార్క్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ మెయిన్‌బోర్డ్ ఐపీవో ఆగస్టు 19న ప్రారంభమవుతుంది. ఇది రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఆగస్టు 21 వరకు తెరచి ఉంటుంది. ఐపీవో పరిమాణం రూ.600.29 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. ఇందుకోసం 0.22 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ జారీ చేయనుంది. అలాగే ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.850 నుంచి రూ.900గా ఉంచాలని కంపెనీ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం గ్రేమార్కెట్లో కంపెనీ ఒక్కో షేరు రూ.325 ఇష్యూ ధరపై ప్రీమియం పలుకుతోంది.

* ఫోర్కాస్ స్టూడియో ఐపీవో ఎన్ఎస్ఈ కేటగిరీలో వస్తోంది. ఇది భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.37.44 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కంపెనీ 46.8 లక్షల తాజా షేర్లను జారీ చేయనుంది. ఆగస్టు 19 నుంచి ఆగస్టు 21 వరకు ఇన్వెస్టర్ల కోసం ఐపీవో తెరవబడుతుంది. ఈ క్రమంలో ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.77 నుంచి రూ.80గా నిర్ణయించబడింది. గ్రేమార్కెట్లో ఐపీవో షేర్లకు రూ.80 ప్రీమియం పలుకుతోంది.
* బ్రేస్ పోర్ట్ లాజిస్టిక్స్ ఐపీవో సైతం ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్టింగ్ కోసం వస్తోంది. ఆగస్టు 19 నుంచి 21 వరకు తెరచి ఉండే ఐపీవో ఇన్వెస్టర్ల నుంచి రూ.24.41 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.76 నుంచి 80గా ప్రకటించింది. ప్రస్తుతం గ్రేమార్కెట్లో కంపెనీ షేర్లకు రూ.90 ప్రీమియం పలుకుతోంది.
* ఓరియంట్ టెక్నాలజీస్ ఐపీవో దేశీయ మార్కెట్ల నుంచి రూ.214 కోట్లను సమీకరించే లక్ష్యంతో ముందుకొస్తోంది. ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.195 నుంచి రూ.206గా నిర్ణయించారు. ఆగస్టు 21 నుంచి 23 వరకు తెరచి ఉండే ఐపీవోపై బెట్టింగ్ వేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు.
* ఆదర్శ టెక్నోప్లాస్ట్ ఇండస్ట్రీస్ ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ ఐపీవో ఆగస్టు 21 నుంచి ఆగస్టు 23 వరకు తెరవబడుతుంది. కంపెనీ గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.121గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని కంపెనీ 1000 షేర్లుగా ఉంచింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ రూ.16.03 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
* QVC ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ఐపీవో NSE SME కేటగిరీలో వస్తోంది. ఆగస్టు 21 నుంచి ఆగస్టు 23 వరకు ఇది తెరవబడుతుంది. కంపెనీ ఐపీఓ పరిమాణం రూ.24.07 కోట్లుగా ఉంది. దీనిని సమీకరించేందుకు ఐపీఓ ద్వారా కంపెనీ 20.50 లక్షల షేర్లను జారీ చేస్తోంది. ఒక్కో షేరుకు గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.86గా ఉంచిన ఐపీవో ప్రస్తుతం గ్రేమార్కెట్ ప్రీమియం రూ.20గా ఉంది.
* రిసోర్స్‌ఫుల్ ఆటోమెుబైల్ కంపెనీ ఐపీవో మార్కెట్ల నుంచి రూ.11.99 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం 10.25 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ జారీ చేస్తోంది. ఈ క్రమంలో షేర్ గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.117 వద్ద ఉంచింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో ఆగస్టు 22 నుంచి 24 వరకు బెట్టింగ్ వేసేందుకు అందుబాటులో ఉండగా గ్రేమార్కెట్లో రూ.20 ప్రీమియంతో ట్రేడవుతోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications