Low Salaries: చిన్న హోటల్‌లో పనిచేసే వంట మాస్టర్ కూడా రోజుకు కనీసం వెయ్యి రూపాయలు సంపాదిస్తున్న రోజులు ఇవి. కానీ.. వైట్ కాలర్ ఉద్యోగులకు అందుతున్న జీతాలు ఎంత దారుణంగా ఉన్నాయో గమనిస్తే ఆశ్చర్యం కలగకమానదు. అయితే ఆఫీసుకు వెళ్లి వైట్ కాలర్ వర్క్ చేసే చాలా మంది ఉద్యోగులు తక్కువ సంపాదిస్తున్నారనే గణాంకాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. 65 శాతం మంది భారతీయుల సగటు జీతం కేవలం రూ.15,000గా ఉందని తాజా నివేదికలో వెల్లడైంది.

భారతీయుల జీతం..
దేశంలోని వైట్ కాలర్ కార్యాలయ ఉద్యోగులుగా పిలవబడే మూడింట రెండు వంతుల మంది నెలకు రూ. 15,000 లేదా అంతకంటే తక్కువ సంపాదిస్తున్నారు. శాలరీ మేనేజ్ మెంట్ యాప్ శాలరీ బాక్స్ విడుదల చేసిన సర్వేలో 65% మంది భారతీయులు యావరేజ్ గా కేవలం రూ.15,000 సంపాదిస్తున్నట్లు తేలింది. కంపెనీలు సెంట్రల్ పే కమిషన్ నిర్ణయించిన కనీస వేతనాన్ని మాత్రమే చెల్లిస్తున్నందున.. దేశవ్యాప్తంగా 850 జిల్లాల్లో పనిచేస్తున్న పది లక్షల మందికి పైగా ఉద్యోగులు నెలకు రూ.18 వేలు మాత్రమే జీతంగా అందుకుంటున్నారు.

స్రీ,పురుషుల జీతాలు..
దేశంలో చాలా మంది మహిళలు యావరేజ్ గా రూ.12,398; పురుషులు సగటున రూ.15,000 సంపాదిస్తున్నారని నివేదిక పేర్కొంది. భారతదేశానికి సంబంధించి శ్రామిక శక్తిలో 27 శాతం మాత్రమే మహిళలు ఉండగా.. మిగిలిన 73 శాతం మంది పురుషులు ఉన్నారు. శ్రామికశక్తిలో 15 శాతం కంటే తక్కువ మంది నెలకు రూ. 20,000-40,000 (సగటున రూ. 25,000) మధ్య సంపాదిస్తున్నారు. మెజారిటీ భారతీయులు నివసించడానికి సరైన స్థలం పొందడంలో కూడా ఇబ్బందులు పడుతున్నట్లు నివేదిక తెలిపింది.

వారి జీతం రూ.9,000 మాత్రమే..
సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలు, టెక్స్‌టైల్ దుకాణాలు మొదలైన వాటిలో పనిచేసే ఉద్యోగులకు కేవలం రూ.8,000 నుంచి రూ.9,000 వేతనంగా పొందుతున్నారు. ఇదే సమయంలో.. రవాణా, ఐటీ కంపెనీలు, టైలరింగ్ కంపెనీలు కాస్త ఎక్కువ వేతనాలు ఇస్తున్నాయని వెల్లడైంది.

దారుణంగా ఫ్రెషర్స్ జీతాలు..
వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించే యువకుల నెలవారీ జీతం చాలా తక్కువగా ఉందని గుర్తించారు. ద్రవ్యోల్బణ సమయంలో మెజారిటీ ఎంట్రీ లెవల్ ఉద్యోగులు ఈ జీతాలతో కుటుంబాలను పోషించటం కష్టంగా మారిందని అంటున్నారు. వీరి పరిస్థితి కనీసం రోడ్డు పక్కడ పండ్ల వ్యాపారికంటే దారుణంగా ఉంది. వారి ఆదాయంలో ఉద్యోగుల జీతం సగమేనని నిపుణులు అంటున్నారు.

యువ పారిశ్రామికవేత్తలు..
ఇలాంటి కారణాల వల్ల నేటి తరం యువతలో కంపెనీల్లో నెలవారీ జీతాలకు పని చేయాలనే ఆసక్తి తగ్గిపోయిందని తెలుస్తోంది. అందుకే.. చాలా మంది రిస్క్ తీసుకుని సొంతంగా వ్యాపారం చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగుతున్నారన్నారు. ఇప్పటికైనా కనీసం చెల్లించే వేతనాలు అవసరాలను తీర్చేవిగా ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు సైతం వీటిపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications