అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ & సెజ్‌తో సహా ఆరు అదానీ గ్రూప్ స్టాక్‌లు కీలకమైన హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత భారీగా పడిపోయాయి. ఇప్పుడు ఈ స్టాక్స్ అన్నీ మళ్లీ సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ఇతర నాలుగు స్టాక్‌లు అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ విల్మర్, ఎన్‌డిటివి ఇప్పటికీ హిండెన్‌బర్గ్ పూర్వ స్థాయిల కంటే దిగువన ట్రేడవుతున్నాయి.
అదానీ టోటల్ గ్యాస్ దాని ప్రీ-హిండెన్‌బర్గ్‌తో పోలిస్తే 74 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 59 శాతం, అదానీ విల్మార్ 35 శాతం, ఎన్డీటీవీ 11 శాతం తగ్గాయి. గడిచిన రెండు సెషన్లలో అదానీ గ్రూప్ స్టాక్స్‌లో ర్యాలీ కారణంగా గ్రూప్ స్టాక్‌ల మార్కెట్ విలువ 200 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. గత సంవత్సరం నుంచి నేటి వరకు, అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ 40 శాతం, అదానీ పవర్ లిమిటెడ్ 35 శాతం
పెరిగాయి.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ఈ ఏడాది 20 శాతం పెరిగాయి. అదానీ చేరిక సెన్సెక్స్ వాల్యుయేషన్‌ను పెంచగలదుని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టాక్ 57x ఫార్వర్డ్ P/E మల్టిపుల్‌తో ట్రేడవుతోంది. విశ్లేషకులు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు 30% అప్‌సైడ్‌ను అంచనా వేస్తున్నారు. నిఫ్టీ50 ఇండెక్స్‌లో అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్నప్పటికీ, సెన్సెక్స్‌లో చేర్చడం వల్ల అదానీ ఎంటర్‌ప్రైజెస్ పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
అంబుజా సిమెంట్స్ 25 శాతం, అదానీ ఎంటర్‌టైన్‌మెంట్ 20 శాతం పెరిగాయి. జనవరి 24, 2023న, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ మానిప్యులేషన్ మరియు అకౌంటింగ్ మోసాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రతిపాదించిన రూ. 20,000 కోట్ల షేర్ విక్రయానికి ముందు ఒక నివేదికను ప్రచురించింది. దీంతో ఆదాని స్టాక్ ల్లో భారీగా ప్రెషర్ కనిపించింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications