For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

6 కంపెనీల మార్కెట్ వ్యాల్యూ రూ.91,629 కోట్లు జంప్: ఐసీఐసీఐ, టీసీఎస్ జంప్

|

ముంబై: టాప్ 10 కంపెనీల్లోని 6 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ లాభపడగా, ఫైనాన్షియల్ స్టాక్స్ నష్టపోయాయి. గతవారం టాప్ 10లోని 5 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.91,699 పడిపోయింది. సెన్సెక్స్ గతవారం 929.83 పాయింట్లు లేదా 2.10 శాతం లాభపడింది. మొత్తంగా గతవారం మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అంతేకాదు, సెన్సెక్స్ 45వేల పాయింట్లను క్రాస్ చేసి నిలబడింది. నిఫ్టీ 13,200 పాయింట్లను దాటింది.

లాభపడిన స్టాక్స్, నష్టపోయిన స్టాక్స్

లాభపడిన స్టాక్స్, నష్టపోయిన స్టాక్స్

గతవారం టాప్ 10 కంపెనీల్లోని 6 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.91,629.38 కోట్లు పెరిగింది. ఇందులో ఐసీఐసీఐ బ్యాంకు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మంచి లాభాలు నమోదు చేశాయి. గతవారంలో సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా హాలీడే ఉంది. నాలుగు రోజులు మాత్రమే మార్కెట్లు కొనసాగాయి. టాప్ 10 కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), హిందూస్తాన్ యూనీ లీవర్ (HUL), ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్ లాభపడ్డాయి. HDFC బ్యాంకు, HDFC, కొటక్ మహీంద్ర బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి.

ఇవి ఎంత జంప్ చేశాయంటే

ఇవి ఎంత జంప్ చేశాయంటే

గతవారం ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పెరిగింది. రూ.20,272.71 కోట్లు లాభపడి రూ.3,46,497.75 కోట్లుగా నమోదయింది.టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.17,579.92 కోట్లు ఎగిసి రూ.10,22,900.07 కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్‌టెల్ ఎం-క్యాప్ రూ.16,694.01 పెరిగి రూ.2,69,449.98 కోట్లుగా నమోదయింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.14,524.89 కోట్లు పెరిగి రూ.4,83,304.06 కోట్లుగా ఉంది. హిందూస్తాన్ యూనీ లీవర్ ఎం-క్యాప్ రూ.11,970.99 కోట్లు ఎగిసి రూ.5,14,118.15 కోట్లకు పెరిగింది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,586.86 పెరిగి రూ.12,34,003.83 కోట్లకు ఎగిసింది.

వీటి ఎం-క్యాప్ డౌన్

వీటి ఎం-క్యాప్ డౌన్

ఇక, HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,589.19 కోట్లు పెరిగి రూ.7,62,747.36 కోట్లకు ఎగిసింది. కొటక్ మహీంద్ర బ్యాంకు ఎం-క్యాప్ రూ.11,037.31 కోట్లకు పెరిగి రూ.3,65,448.53 కోట్లకు పెరిగింది. HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,803.38 కోట్లు ఎగిసి రూ.4,04,192.73 కోట్లుగా నమోదయింది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.1,708.34 పెరిగి రూ.2,93,758.31 కోట్లకు ఎగిసింది.

English summary

6 కంపెనీల మార్కెట్ వ్యాల్యూ రూ.91,629 కోట్లు జంప్: ఐసీఐసీఐ, టీసీఎస్ జంప్ | 6 of top ten most valued firms add cumulative Rs 91,629 crore in market capitalisation

Six of the top-10 most valued domestic firms added ₹91,629.38 crore cumulatively in market valuation last week, with ICICI Bank and Tata Consultancy Services clocking maximum gains.
Story first published: Sunday, December 6, 2020, 15:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X