మోస్ట్ వ్యాల్యూడ్ టాప్ 10లోని 6 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1.38 లక్షల కోట్లు హరించుకుపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు పెద్ద ఎత్తున నష్టపోయాయి. గత వారం సెన్సెక్స్ 522 పాయింట్లు లేదా 1.36 శాతం మేర నష్టపోయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోయింది.

రిలయన్స్, హెచ్డీఎఫ్సీ భారీ నష్టం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) మార్కెట్ క్యాప్ రూ.50,239.78 కోల్పోయి రూ.13,10,323.21కు క్షీణించింది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.46,374.63 కోట్లు క్షీణించి రూ.5,67,877.74కు పడిపోయింది.
ఐసీఐసీఐ బ్యాంకు ఎంక్యాప్ రూ.22,631.74 తగ్గి రూ.కోట్లకు,
HDFC మార్కెట్ క్యాప్ రూ.10,078.06 పడిపోయి రూ.3,09,254.09కు,
ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,815.12 క్షీణించి రూ.2,38,660.74కు పడిపోయింది.
భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.2,700.5 తగ్గి రూ.3,02,701.60కు క్షీణించింది.

పెరిగిన ఐటీ కంపెనీల మార్కెట్ క్యాప్
గత వారం టాప్ 10లోని టెక్ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), ఇన్ఫోసిస్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది.
టీసీఎస్ ఎం-క్యాప్ రూ.47,054.91 కోట్లు పెరిగి రూ.8,56,463.05 కోట్లకు,
ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.18,591.83 పెరిగి రూ.4,11,554.51 కోట్లకు పెరిగింది.
అలాగే, కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,481.72 కోట్లు ఎగిసి రూ.2,70,600.52 కోట్లకు, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ ఎం-క్యాప్ రూ.740.11 పెరిగి రూ.5,19,931.93కోట్లుగా ఉంది.

టాప్ 10 కంపెనీలు
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ టెన్ కంపెనీల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా టీసీఎస్, HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, HDFC, భారతీ ఎయిర్ టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఐటీసీ, ICICI బ్యాంకు ఉన్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications