ముంబై: టాప్ 10లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,06,523.84 కోట్లు పెరిగింది. ఈ వారంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ కంపెనీలు దూకుడుగా ఉండటంతో ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది. గత వారం సెన్సెక్స్ 1,032.59 పాయింట్లు లేదా 2.68 శాతం లాభపడింది. అంతేకాదు, బ్యాంక్స్, ఫైనాన్షియల్ సంస్థల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీ 50 కరోనా మహమ్మారి ముందు స్థాయికి చేరుకున్నాయి.

ఈ కంపెనీల ఎం-క్యాప్ అప్, ఈ కంపెనీలు డౌన్
టాప్ 10 మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీల్లో గతవారం మార్కెట్ క్యాప్ పెరిగిన సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్(HUL), ఇన్ఫోసిస్, ఐటీసీ కంపెనీల మార్కెట్ క్యాప్ తరిగిపోయింది.

ఏ కంపెనీ మార్కెట్ క్యాప్ ఎంత పెరిగిందంటే?
- ఐసీఐసీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26,620.32 పెరిగి రూ.2,82,550.05 కోట్లకు చేరుకుంది. గతవారం అతిపెద్ద గెయినర్‌గా ఐసీఐసీఐ బ్యాంకు నిలిచింది.
- కొటక్ మహీంద్రా మార్కెట్ క్యాప్ రూ.25,360.91 కోట్లు పెరిగి రూ.2,90,458.09 కోట్లుగా నిలిచింది.
- రిలయన్స్ ఎం-క్యాప్ రూ.21,458.89 కోట్లు పెరిగింది. దీంతో ఈ కంపెనీ ఎం-క్యాప్ రూ.13,41,164.42 కోట్లకు పెరిగింది.
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎం క్యాప్ రూ.,16,547.52 పెరిగి రూ.6,13,598.67, హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,599.47 కోట్లు ఎగిసి రూ.3,37,472.45 కోట్లుగా ఉంది.
- భారతీ ఎయిర్‌టోల్ మార్కెట్ క్యాప్ రూ.1,936.73 పెరిగి రూ.2,85,625.71 కోట్లకు చేరుకుంది.

ఏ కంపెనీ ఎం-క్యాప్ ఎంత క్షీణించిందంటే
- HUL మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,982.71 కోట్లు క్షీణించి రూ.5,05,658.41 కోట్లకు పడిపోయింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.5,963.14 పడిపోయి రూ.3,98,188.66 కోట్లకు తగ్గింది.
- టీసీఎస్ ఎం క్యాప్ రూ.4,165.15 పడిపోయి రూ.8,39,445.98 కోట్లకు తగ్గింది.
- ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.1,661.13 కోట్లు క్షీణించి రూ.2,40,619 కోట్లకు పడిపోయింది.

టాప్ 10 కంపెనీలు వరుసగా
కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హిందూస్తాన్ యూనీ లీవర్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ ఉన్నాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications