కరోనా ఎఫెక్ట్: జీఎస్టీ చెల్లింపుల నుంచి రిలీఫ్!

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పటికే నెల రోజులకు పైగా మెజారిటీ ప్రజలు, ఫ్యాక్టరీలు, కార్యాలయాలు పనిచేయక ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతోంది. మరో వారం రోజుల్లో లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందని చెబుతున్నా... కచ్చితంగా దానిని ప్రకటిస్తారని చెప్పలేని సందర్భాలు నెలకొన్నాయి. ఎందుకంటే, గత రెండు మూడు రోజులుగా దేశంలో కరోనా కేసులు విజ్రింభిస్తున్నాయి.

ఒక్క మహారాష్ట్ర లోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు 8,000 దాటి ఆందోళన కలిగిస్తున్నాయి. మిగితా రాష్ట్రాల్లోనూ వేగంగా కేసులు నమోదు అవుతున్నాయి. కాబట్టి, మే 3 నుంచి లాక్ డౌన్ ఎత్తివేస్తారా... లేదంటే మరో వారం, పది రోజులు పొడిగిస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఐతే లాక్ డౌన్ ఎత్తివేసినా... అందరికీ ఒకేసారి పనిచేసుకునే అవకాశం కల్పించకపోవచ్చు.

అందరినీ ఒకేసారి అనుమతిస్తే.. మళ్ళీ జనాలు పెద్ద సంఖ్యలో గుమికూడి మునుపటి పరిస్థితులు ఎదురవుతాయని ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలా కాకుండా దశల వారీగా ఒక్కో రంగానికి అనుమతి ఇస్తే కొంత కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉంచితే, లాక్ డౌన్ వల్ల దెబ్బతిన్న వ్యాపారులను ఆదుకునేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం.

వాయిదానా... లేదా రద్దా?

వాయిదానా... లేదా రద్దా?

మహమ్మారి దెబ్బకు ప్రపంచమే విలవిలలాడుతోంది. ఇక రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు ఎన్నో. అలాగే చిన్న వ్యాపారాలు చేసుకుని స్వయం ఉపాధి పొందేవారు, చిన్న తరహా పరిశ్రమలు, కంపెనీలు నడిపే యజమానులకు పెద్ద కష్టమొచ్చి పడింది. వ్యాపారం లేక రుణాలు చెల్లించలేని పరిస్థితి. అలాగే ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దైన్యం వారిది.

అందుకే ఇప్పటికే 3 నెలల రుణ వాయిదాల చెల్లింపుల పై మారటోరియం అమలు చేస్తున్నట్లే... ఇప్పుడు జీఎస్టీ నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే జీఎస్టీ ని పూర్తిగా రద్దు చేయాలా, లేదంటే కొంత కాలం పాటు చెల్లింపులను వాయిదా వేయాలా అన్న అంశంపై కూడా తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అన్ని రంగాలకు వర్తిస్తుందా...

అన్ని రంగాలకు వర్తిస్తుందా...

అయితే లాక్ డౌన్ వల్ల ఎక్కువగా దెబ్బతిన్న రెస్టారెంట్లు, హోటల్స్, ఎయిర్ లైన్స్, రియల్ ఎస్టేట్, తయారీ వంటి రంగాలకు మాత్రమే దీనిని పరిమితం చేస్తారా... లేదా అన్ని రంగాలకు వర్తిస్తుందా అనే విషయంపై కూడా ప్రభుత్వ పెద్దలు చర్చోపచర్చలు జరుపుతున్నట్లు వినికిడి.

ఎదో ఒక్క రంగానికే మినహాయింపులు ఇస్తే.. మిగితా రంగాల నుంచి కూడా మళ్ళీ వినతులు, డిమాండ్ లు వెల్లువెత్తుతాయని, దానికి బదులు అన్ని రంగాలకు జీఎస్టీ చెల్లింపుల నుంచి 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉపశమనం కలిగించే అంశాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే లక్షలాది వ్యాపారులకు, కోట్ల మంది ఉద్యోగులకు శుభవార్త అందించినట్లే. అయితే రద్దు చేసిన పీరియడ్ కు పెనాల్టీలు, వడ్డీలు వసూలు చేసే యోచన కూడా ఉండబోదని స్పష్టం చేస్తున్నారు. అలా అయితేనే, దాని పూర్తి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.

రాబడి అంతంతే...

రాబడి అంతంతే...

దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నెలలో కూడా ప్రభుత్వానికి ఆశించిన స్థాయి రాబడి రాలేదు. నెలకు రూ 1 లక్ష కోట్ల ఆదాయం సమకూరటం కూడా గగనం అయిపోయింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడింది. జీఎస్టీ అమలు అస్తవ్యస్తంగా ఉండటం, రేట్లు అధికం కావటం తో చిన్న వ్యాపారులు రిజిస్టర్ చేసుకున్నా కూడా జీఎస్టీ చెల్లించేందుకు ముందుకు రాలేదు.

ఈ పరిణామాల దృష్ట్యా... ప్రస్తుతం మరో సారి ఇన్వాయిస్ విధానానికి కూడా కొంత వెసులుబాటు కల్పించి, నగదు రూపంలో జరిగిన లావాదేవీలను కూడా పరిగణన లోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే, కంపెనీకి వాస్తవంగా వచ్చిన సొమ్ముపై మాత్రమే జీఎస్టీ చెల్లించేలా ఉపశమనం కల్పించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా... ఒక ఆరేడు నెలల పాటు జీఎస్టీ ని పూర్తిగా రద్దు చేస్తే... వ్యాపారాలు కోలుకుని మళ్ళీ ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కుతుందని సామాన్యులు కోరుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+