Allowances Revision: ఆ ఉద్యోగులకు భారీ జాక్ పాట్.. ఈ 6 అలవెన్సులకు రివైజ్డ్ రేట్లు
7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం గుడ్‌న్యూస్ చెప్పింది. సిబ్బందికి అందిస్తున్న ప్రయోజనాలను సమీక్షించి పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల అలవెన్సులను సంవరించేందుకు అంగీకరించింది. ఈ మేరకు పూర్తి వివరాలతో ఏప్రిల్ 2న ఓ ఆఫీస్ మెమోరాండంను రిలీజ్ చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గృహనిర్మాణం, రవాణా, విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు ప్రయాణ ఖర్చులు వంటి వాటి కోసం వివిధ భత్యాలను అందుకుంటున్నారు. వారితో పాటు రైల్వే మరియు రక్షణ సిబ్బందికి వర్తిస్తున్న పలు ప్రయోజనాలను 7వ వేతన సంఘం సమీక్షించింది. దాని సిఫార్సులతో కేంద్రం ప్రభుత్వం మొత్తం 6 కీలక అలవెన్సులను సవరించింది.

రిస్క్, నైట్ డ్యూటీ (NDA), ఓవర్ టైమ్ (OTA), చిల్డ్రన్ ఎడ్యుకేషన్, పార్లమెంట్ అసిస్టెంట్‌లకు ప్రత్యేక చెల్లింపు మరియు వికలాంగ మహిళలకు ప్రత్యేక శిశు సంరక్షణ అంటూ మొత్తం 6 రకాల అలవెన్సుల కోసం 7వ వేతన సంఘం సిఫార్సు చేసింది. దీంతో అన్ని విధాలుగా ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.
చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ (CEA) ద్వారా ఇద్దరు పిల్లలకు నెలకు 6 వేల 750 హాస్టల్ సబ్సిడీ క్లెయిమ్ చేయవచ్చు. దివ్యాంగులకు డబుల్ బెనిఫిట్ ఉండగా.. DA 50 శాతం పెరిగినప్పుడల్లా CEA రేటు 25 శాతం పెరుగుతుంది. ప్రమాదకర విధుల్లో నిమగ్నమైన లేదా పనివల్ల కాలక్రమేణా ఆరోగ్యం దెబ్బతినే ఉద్యోగులకు రిస్క్ అలవెన్స్ అందించబడుతుంది. 10 PM మరియు 6 AM గంటల మధ్య పనిచేస్తే నైట్ డ్యూటీగా నిర్వచించబడింది.
'ఆపరేషనల్ స్టాఫ్' కేటగిరీ కిందకు వచ్చే సిబ్బందికి ఓవర్ టైమ్ అలవెన్స్ ఇవ్వబడుతుంది. ఈ రేట్లలో ఎలాంటి అప్‌వర్డ్ రివిజన్ ఉండదు. పార్లమెంటు సమావేశాల వేళ పనిలో నిమగ్నమైన వారికి అలవెన్స్ రేట్లు 50 శాతం పెంచబడ్డాయి. వికలాంగులైన మహిళలకు పిల్లల సంరక్షణ కోసం రెండేళ్లపాటు 3 వేల భత్యం అందజేస్తారు. DA 50 పెరిగిన ప్రతిసారీ దీని పరిమితి కూడా 25 శాతం పెరుగుతుంది.


Click it and Unblock the Notifications