Rocket Stock: దేశంలో టెలికాం రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో నూతన 5జీ సాంకేతికతను కంపెనీలు అన్ని నగరాలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటితో పోటీ పడేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ సైతం తన సాంకేతిక పరివర్తనను ప్రారంభించింది.
ఈ క్రమంలో నూతన 4జీ, 5జీ సాంకేతికతో కొత్త జవసత్వాలు పొందేందుకు బాధ్యతలను టాటాలకు చెందిన టీసీఎస్ కు అప్పగించింది. అయితే తాజాగా టీసీఎస్ ఇందుకు అవసరమైన టెలికాం పరికరాలకు సంబంధించిన రూ.7,492 కోట్ల విలువైన ఆర్డర్ ను తేజస్ నెట్‌వర్క్స్ కంపెనీ అప్పగించింది. దీంతో కంపెనీ షేర్లు నేడు మార్కెట్లో రాకెట్ వేగంతో పరిగెడుతున్నాయి. ఉదయం 9.50 గంటల సమయంలో స్టాక్ ఎన్ఎస్ఈలో 4.86 శాతం లాభపడి రూ.851.90 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీసీఎస్, తేజస్ నెట్‌వర్క్స్ కంపెనీలు రెండూ టాటా గ్రూప్ కు చెందినవే. తేజస్ నెట్‌వర్క్స్ అనేది టాటా గ్రూప్‌లోని వైర్‌లెస్ నెట్‌వర్కింగ్ ఉత్పత్తులను డిజైన్ చేసి తయారు చేస్తున్న విభాగం. TCSతో BSNL పాన్-ఇండియా 4G/5G నెట్‌వర్క్ కోసం దాని రేడియో యాక్సెస్ నెట్‌వర్క్(RAN) పరికరాల సరఫరా, మద్దతు మరియు నిర్వహణ సేవల కోసం మాస్టర్ కాంట్రాక్ట్‌ను అమలు చేసినట్లు తేజస్ తెలిపింది.
ఆర్డర్‌లో భాగంగా 2023, 2024 క్యాలెండర్ సంవత్సరాల్లో తేజస్ 1,00,000 సైట్‌లకు పరికరాలను సరఫరా చేయనుందని తెలుస్తోంది. అత్యాధునిక 4G/5G RAN ఉత్పత్తులను దాదాపు 18 నెలల పాటు BSNL కఠినమైన ఫీల్డ్ టెస్టింగ్‌లకు గురి చేసిందని తేజస్ నెట్‌వర్క్స్ యొక్క CTO డా.కుమార్ ఎన్ శివరాజన్ వెల్లడించారు.

తేజస్ నెట్‌వర్క్స్ 75 దేశాల్లో టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, యుటిలిటీస్, డిఫెన్స్ & ప్రభుత్వ సంస్థల కోసం వైర్‌లెస్, వైర్‌లెస్ నెట్‌వర్కింగ్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. టాటా గ్రూప్‌లో భాగమైన తేజస్ మెజారిటీ వాటాదారు టాటా సన్స్ అనుబంధ సంస్థ అయిన పనాటోన్ ఫిన్‌వెస్ట్ కలిగి ఉంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications