5జీ సేవలు: క్వాల్‌కామ్‌తో జతకట్టిన జియో... త్వరలో భారత్‌లో మరో విప్లవం
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో సంస్థ 5జీ సేవలు త్వరగా తీసుకొచ్చేందుకు ప్రముఖ వైర్‌లెస్ టెక్నాలజీ మరియు సెమీకండక్టర్ సంస్థ క్వాల్‌కామ్‌తో జత కట్టింది. క్వాల్ కామ్ సంస్థతో జియో సంస్థ కలిసి 5జీ సేవలకు సంబంధించిన హైస్పీడ్ నెట్‌వర్క్‌ను తమ వినియోగదారులకు అందించాలని భావిస్తోంది. జియోతో పాటు అమెరికాలోని మరో సంస్థ రేడిసిస్ కార్ప్‌కూడా క్వాల్ కామ్ టెక్నాలజీస్‌తో జతకట్టింది.
ఇదిలా ఉంటే భారత్‌లో ఇంకా 5జీ సేవలు పేపర్ పైనే ఉండగా దీన్ని నిజం చేయాలని రిలయన్స్ అధినేత అంబాని భావిస్తున్నారు. అయితే ఇదంతా జరిగేందుకు చైనాకు చెందిన కొన్ని సంస్థలు భాగస్వాములు కావడం, చైనా ఎక్విప్‌మెంట్‌లు వినియోగించడం తప్పనిసరి కానున్న నేపథ్యంలో రాజకీయ దుమారం చెలరేగే అవకాశం కనిపిస్తోంది. భారత మార్కెట్లో తన టెక్నాలజీ విజయం సాధిస్తే ఇతర దేశాలకు కూడా ఈ టెక్నాలజీని అందిచాలన్న యోచనలో అంబానీ ఉన్నట్లు సమాచారం.

నాలుగేళ్ల క్రితం జియో భారత టెలికాం మార్కెట్లోకి వచ్చి తక్కువ డబ్బులతోనే ఇంటర్నెట్ సౌకర్యం అందించి ఒక చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం జియోకు 400 మిలియన్ యూజర్లు ఉన్నారంటే ఎంతటి సక్సెస్ సాధించిందో అర్థమవుతోంది. అంతేకాదు జియో దెబ్బకు ఇతర ప్రధాన టెలికాం సంస్థలు కుదేలయ్యాయి.
ఇక జియో సంస్థ 5జీ స్మార్ట్ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక జియో సృష్టించిన విప్లవంతో ముఖేష్ అంబానీ తన ఎనర్జీ సంస్థలను కూడా టెక్నాలజీ రంగంలోకి రూపాంతరం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ - కామర్స్ రంగంలోకి దిగి సంచలనాలను సృష్టిస్తోంది ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ. ఇక ఈ ఏడాది జియోకు చెందిన వాటాలను ఫేస్‌బుక్ మరియు గూగుల్ సంస్థలకు విక్రయించి 20 బిలియన్ డాలర్లను పోగు చేశారు.


Click it and Unblock the Notifications