మరోసారి జిఎస్టి కౌన్సిల్ సమావేశం.. ఈసారి ఈ వస్తువులపై జిఎస్టి రేటు మారే ఛాన్స్..
మరోసారి జిఎస్టి కౌన్సిల్ సమావేశం కానుంది. అయితే ఈసారి మాత్రం జిఎస్టి రేట్లలో మార్పులకు సూచనలు అందుతున్నట్లు తెలుస్తుంది. వీటిలో ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ జిఎస్టి రేట్ల మార్పు సామాన్యుడికి ఉపశమనం కలిగిస్తాయా అన్నది వేచిచూడాలి.
55వ GST కౌన్సిల్ సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 21 డిసెంబర్ 2024న రాజస్థాన్‌లో నిర్వహించనుంది. ఈ సమావేశానికి ముందు మంత్రుల బృందం (GoM) 148 వస్తువులపై GST రేట్లలో కీలక మార్పులు చేయాలనీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయితే ఈ వస్తువులలో పొగాకు, ఎరేటెడ్ పానీయాలు, బాటిల్ డ్రింకింగ్ వాటర్, హెల్త్ ఇన్సూరెన్స్, వ్రిస్ట్ వాచీలు, గార్మెంట్స్ సహా ఇంకా కొన్ని ఇతర ఉన్నాయి. ఇందులో మెజారిటీ శాతం వస్తువులు ప్రతిరోజు ఇంకా నిత్యవసర ఉపయోగం కోసం వాడేటివి. ప్రతిరోజు & సాధారణంగా వినియోగించే వస్తువులపై జిఎస్టి రేట్లను తగ్గించేందుకు అనుకూలంగా 148 కంటే ఎక్కువ వస్తువులపై GST రేట్లు మార్చాలని మంత్రుల బృందం ప్రతిపాదించిందని రిపోర్ట్స్ తెలిపాయి.

20 లీటర్లతో పాటు బాటిల్ డ్రింకింగ్ వాటర్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై GST రేటు 5%కి తగ్గించాలని GoM ప్రతిపాదించింది. అయితే ప్రస్తుతం ఈ వస్తువులపై జీఎస్టీ రేటు 18 శాతంగా ఉంది. రూ. 25 వేల ధర కంటే ఎక్కువగా ఉన్న వ్రిస్ట్ వాచీలు లేదా రూ. 15 వేల కంటే ఎక్కువ ఉన్న షూలపై జీఎస్టీ రేట్లు ప్రస్తుతం 18% నుండి 28%కి పెంచాలని సిఫార్సు చేసింది. ఇంకా రూ. 1,500 విలువైన రెడీ మేడ్ గార్మెంట్స్ పై జిఎస్‌టిని 5 శాతానికి తగ్గించాలని GoM ప్రతిపాదించగా, ప్రస్తుతం రెడీమేడ్ దుస్తులపై 5-12% జిఎస్‌టి, రూ.1500 నుండి రూ. 10వేల విలువైన రెడీ మేడ్ గార్మెంట్స్ పై జిఎస్‌టి రేటు 18%గా ఉంది. పొగాకు, ఎరేటెడ్ డ్రింక్స్ వస్తువుల విషయంలో చూస్తే 35% ప్రత్యేక GST రేటును ప్రవేశపెట్టాలని GoM సిఫార్సు చేస్తోంది.
నివేదిక ప్రకారం ఎరేటెడ్ పానీయాలు కాకుండా పొగాకు ఇంకా పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 35% వరకు ప్రత్యేక రేటును ప్రతిపాదించాలని ప్రభుత్వం చూస్తోంది. ముఖ్యంగా, 5%, 12%, 18% అలాగే 28% సాధారణ GST పన్ను కొనసాగుతాయని, 35% రేటు దీనికి కొత్తగా అదనంగా ఉంటుందని రిపోర్ట్ హైలైట్ చేసింది.


Click it and Unblock the Notifications