For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందుకే, వచ్చే రెండేళ్లలో ఉద్యోగం వదిలేస్తాం: 53% మహిళలది ఇదే మాట

|

తీవ్రమైన పని ఒత్తిడి, అనుకూల సమయాలు లేకపోవడం వల్ల వచ్చే రెండేళ్ల కాలంలో తాము ఉద్యోగాలు వదిలేస్తామని 53 శాతం మంది మహిళలు వెల్లడించారు. ఈ మేరకు డెలాయిట్ సర్వేలో వెల్లడైంది. కరోనా మహమ్మారి సమయంలో కొనసాగిన గ్రేట్ రిజిగ్నేషన్ మరింత కాలం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని ఈ సర్వేలో తేలింది. వుమెన్ ఎట్ వర్క్ 2022: గ్లోబల్ ఔట్ లుక్ పేరుతో డెలాయిట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

భారత్ సహా పది దేశాల్లో 5000 మంది ఉద్యోగినుల నుండి అభిప్రాయాలు సేకరించి, ఈ నివేదికను రూపొందించారు. ఇందులో భారత్ నుండి 500 మంది ఉన్నారు. 56 శాతం మంది తాము ఉద్యోగంలో అధికంగా ఒత్తిడి ఎధుర్కొంటుండటంతో పాటు అలిసిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న సంస్థలో పని వేళలు అనుకూలంగా లేవని, ఒత్తిడి అధికంగా ఉండటంతో కొత్త సంస్థకు మారాలని భావిస్తున్నట్లు 40 శాతం మంది తెలిపారు.

53 percent of Women Plan To Quit Their Jobs in the Next Two Years Due to Burnout

56 శాతం మంది తాము ఉద్యోగంలో అధికంగా ఒత్తిడిని ఎదుర్కోవడంతో పాటు అలిసిపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న సంస్థలో పనివేళలు అనుకూలంగా లేవని, ఒత్తిడి అధికంగా ఉండటంతో కొత్త సంస్థలోకి మారాలని భావిస్తున్నట్లు నలభై శాతం మంది తెలిపారు. ఏడాది క్రితంతో పోలిస్తే చాలామంది తమ వృత్తి జీవితం అంత ఆశాజనకంగా లేదని తెలిపారు. వచ్చే రెండేళ్ల వరకు ఇదే ఉద్యోగంలో కొనసాగుతామని కొందరు చెప్పారు. అయిదేళ్ల వరకు సంస్థను మారేది లేదని 9 శాతం మంది తెలిపారు.

English summary

అందుకే, వచ్చే రెండేళ్లలో ఉద్యోగం వదిలేస్తాం: 53% మహిళలది ఇదే మాట | 53 percent of Women Plan To Quit Their Jobs in the Next Two Years Due to Burnout

The Great Resignation is set to continue for women, as a new survey finds that more than half of them plan to quit their job within the next two years, due to widespread burnout.
Story first published: Thursday, April 28, 2022, 12:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X