Ayodhya Rama Mandir: జాతిపితగా మహాత్మాగాంధీకి భారతదేశం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే మన కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాన్ని ప్రచురించారు. అయితే కనీసం కొన్ని నోట్లపై అయినా ఇతర స్వాతంత్ర్య సమరయోధుల ఫొటోలు ప్రింట్ చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక వైపు శ్రీరాముడి చిత్రం, మరోవైపు అయోధ్య రామ మందిరంతో అలంకరించబడిన 500 రూపాయల నోటు ప్రస్తుతం నెట్టింట ట్రైండ్ అవుతోంది. అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్ఠించిన సందర్భంగా 22 జనవరి, 2024న విడుదల కానున్న కరెన్సీ నోట్లు అని ఈ ఫోటోలతో కూడిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.

దీని ప్రామాణికతపై పలువురిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు కరెన్సీ నోట్లపై ఫొటోలను మార్చే అవకాశం లేదు. దేశంలో కరెన్సీ నోట్లను జారీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉంది. RBI సెంట్రల్ బోర్డ్ చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని.. నోట్ల రూపకల్పన, రూపం మరియు మెటీరియల్‌ని కేంద్ర ప్రభుత్వంపై ఆమోదిస్తుంది.
అయితే రామమందిర ప్రతిష్ఠ సందర్భంగా కొత్త నోట్ల సిరీస్ విడుదల చేస్తున్నట్లు అటు రిజర్వ్ బ్యాంక్ కానీ, ఇటు కేంద్రం కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ నిజంగా అటువంటిది జరిగి ఉంటే ఆ విషయాన్ని RBI ఖచ్చితంగా తన వెబ్‌సైట్‌లో తెలియజేస్తుంది మరియు పత్రికా ప్రకటనల ద్వారా ప్రజలకు నివేదిస్తుంది. ఈ తరహా వ్యవహారాలు ఏవీ జరగలేదు కాబట్టి ఇదంతా ఫేక్ న్యూస్ అని అర్థం చేసుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు.
వైరల్ ఇమేజ్ లో జాగ్రత్తగా పరిశీలిస్తే ఓ ట్విట్టర్ యూజర్ నేమ్ తో కూడిన వాటర్‌మార్క్‌ను గుర్తించవచ్చు. ఇందులో 'శ్రీరామ భక్తుడు గాంధీ కూడా ఇదే కోరుకున్నారు' అంటూ క్యాప్షన్ చూడవచ్చు. పోస్ట్ కింద ఉన్న వ్యాఖ్యలను చూస్తే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నోటు అధికారికంగా విడుదల చేయబడలేదని స్పష్టమవుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications