రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఇంకా నడుస్తోంది. యుద్ధం ప్రారంభంలో రష్యాపై అనేక దేశాలు ఆంక్షాలు విధించాయి. అయినా రష్యా వెనక్కు తగ్గకుండా ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తూ వస్తోంది. ఆంక్షాలతో రష్యా ఇప్పటికే చాలా నష్టోపోయింది. రష్యా నుంచి ముడిచమురు, గ్యాస్ దిగుమతి నిలిపివేయడంతో యూరప్ లో కష్టాలు మొదలయ్యాయి. అంతే కాదు తాజాగా జర్మనీలో ఆర్థిక మాంద్యానికి కారణమైంది.
రష్యా ఉక్రెయిన్ పై ఇంకా దాడులు కొనసాగిస్తుండడంతో జీ7 దేశాలు ఆంక్షాలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించాయి. దీంతో రష్యాపై మరింత ఒత్తిడి పెరిగింది. రష్యాలో పనిచేస్తున్న 500 విదేశీ కంపెనీలు తమ వ్యాపారాన్ని నిలిపివేశాయి. 151 విదేశీ కంపెనీలు సిబ్బందిని తగ్గించాయి. 175 కంపెనీలు తమ మూసివేత ప్రణాళికలను వాయిదా వేసుకున్నాయి. 230 కంపెనీలు నిషేధం ఉన్నప్పటికీ ట్రేడింగ్ కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి.

యూరప్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ తన రష్యన్ వ్యాపారం, ఫ్యాక్టరీ మరియు 4,000 మంది ఉద్యోగులను ప్రముఖ రష్యన్ డీలర్ అవిలోన్‌కు విక్రయించాలని నిర్ణయించినట్లు శుక్రవారం ప్రకటించింది. బర్గర్ కింగ్, కార్ల్స్ జూనియర్ బ్రాండ్ స్టోర్‌లు రష్యాలోని CKE రెస్టారెంట్లకు చెందిన రెస్టారెంట్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ యాజమాన్యంలో ఉన్నాయి. రష్యా రాజధాని మాస్కోతో పాటు దేశవ్యాప్తంగా ఇవి కొనసాగుతాయని ప్రకటించింది.
ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాలు పెద్దఎత్తున సహాయం చేస్తున్నాయి. విదేశాల సహాయంతో ఉక్రెయిన్ రష్యా దాడులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఉక్రెయిన్ మిలిటరీ రష్యాలో డ్రోన్ దాడిని ప్రారంభించిన తర్వాత రష్యా తన అతిపెద్ద డ్రోన్ దాడిని ప్రారంభించింది. అయితే రష్యాపై పలు దేశాలు ఆంక్షాలు విధిచగా.. చైనా, భారత్ మాత్రం రష్యా నుంచి డిస్కౌంట్ లో చమురును దిగుమతి చేసుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications