ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించి నేటికి అయిదేళ్లు. నల్లధనం రూపుమాపడానికి, అదే విధంగా నోట్ల చలామణిని తగ్గించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచే లక్ష్యంతో ఈ ప్రకటన వచ్చింది. ఈ అయిదేళ్ల కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. అదే సమయంలో నోట్ల చలామణి కూడా పెరగడం గమనార్హం. నగదు ట్రాన్సాక్షన్స్ పెరిగినప్పటికీ డిజిటల్ చెల్లింపులతో పోలిస్తే మాత్రం వీటి వినియోగ వృద్ధి భారీగా తగ్గింది. అయిదేళ్ల క్రితం అప్పుడు చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌లో మాత్రం గణనీయ వృద్ధి సాధించింది భారత్. గత అయిదేళ్ల కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వార్షిక సగటు వృద్ధి 55 శాతంగా ఉంది. గత ఏడాది కరోనా సమయంలో నగదు చలామణి పెరగడానికి వివిధ అంశాలు కారణం.

డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వేగం... నగదు వినియోగమూ అంతే
గత ఆర్థిక సంవత్సరం ప్రజలు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని ప్రజలు తమ వద్ద నగదును అట్టిపెట్టుకున్నారు. కరోనా కారణంగా ఫిజికల్ కరెన్సీని తీసుకోవడానికి చాలామంది వెనుకాడారు. అందుకే క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌కు మొగ్గు చూపారు. డెబిడ్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, UPI వంటి డిజిటల్ చెల్లింపులు పెరిగాయి.
నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) తీసుకు వచ్చిన యూపీఐకి ఆదరణ పెరిగింది. చెల్లింపులకు ప్రధాన సాధనంగా అత్యంత వేగంగా ఎదిగింది. డిజిటల్ చెల్లింపుల కోసం తీసుకు వచ్చిన UPI ద్వారా రూ.7.71 లక్షల కోట్ల విలువైన 421 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. పేటీఎం, ఫోన్‍పే, గూగుల్ పే వంటి యాప్స్‌తో డిజిటల్ చెల్లింపులు మరింత పెరిగాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చాలా వేగంగా పెరుగుతున్నప్పటికీ నగదు వినియోగం ఇంకా ఎక్కువే కనిపిస్తోంది.

రెండేళ్లు లేని రూ.2000 నోట్ల ముద్రణ
2020-21 ఆర్థిక సంవత్సరంలో చలామణీలో ఉన్న నగదు వ్యాల్యూ 16.8 శాతం, నోట్ల సంఖ్య 7.2 శాతం పెరిగాయి. 2019-20లో ఇవి వరుసగా 14.7 శాతం, 6.6 శాతం పెరిగాయి. 2014 అక్టోబర్ - 2020 అక్టోబర్ మధ్య కాలంలో చలామణిలో ఉన్న నోట్ల సంఖ్య సగటున 14.51 శాతం పెరిగింది. రూ.500 లోపు ఉండే చెల్లింపుల్లో ఎక్కువ భాగం ఇప్పటికీ నగదు రూపంలోనే కొనసాగుతోంది.
UPI ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే రూ.7.71 లక్షల కోట్లు. 2021 మార్చి 31వ తేదీ నాటికి మొత్తం నగదులో రూ.500, రూ.2000 నోట్ల వ్యాల్యూ 85.7 శాతం, 2020 మార్చి 30వ తేదీ నాటికి 83.4 శాతం. గత రెండు ఆర్థిక సంవత్సరాలలో రూ.2000 నోట్ల ముద్రణ లేదు.

నగదు చలామణి...
నోట్ల రద్దు చేయడానికి ముందు.. నవంబర్ 4, 2016 నాటికి చలామణిలో ఉన్న నగదు రూ.17.74 లక్షల కోట్లు. 2021 అక్టోబర్ 29వ తేదీ నాటికి ఇది రూ.29.17 లక్షల కోట్లకు పెరిగింది.
2020 అక్టోబర్ 30 నాటికి రూ.26.88 లక్షల కోట్ల విలువైన నగదు చలామణిలో ఉండగా, ఈ ఏడాదిలో ఇది రూ.2,28,963 పెరిగింది. అదే సమయంలో 2019 అక్టోబర్ నుండి 2020 అక్టోబర్ 29 నాటికి రూ.4,57,059 కోట్ల విలువైన నోట్లు చలామణిలోకి వచ్చాయి. అంటే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరం దాదాపు సగం తగ్గింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications