నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుండి కేంద్ర బడ్జెట్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. దివంగత అరుణ్ జైట్లీ 2014లో తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. జైట్లీ, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ పలువురు ఆర్థికమంత్రులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మోడీ ప్రభుత్వం కాలంలో కేంద్ర బడ్జెట్‌లో పలు మార్పులు చేటు చేసుకున్నాయి. తేదీ మార్పు నుండి టాబ్లెట్ వరకు అనేక మార్పులు వచ్చాయి. చాన్నాళ్ల తర్వాత సంప్రదాయ బడ్జెట్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి.

హల్వా వేడుక
2022లో కేంద్ర ఆర్థిక శాఖ హల్వా వేడుకను పక్కన పెట్టింది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హల్వా వేడుక నిర్వహించవద్దని నిర్ణయించారు. హల్వా వేడుకకు బదులు మిఠాయిలు పంచుతున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. హల్వా వేడుకకు దూరంగా ఉండటం ఇదే మొదటిసారి.

బడ్జెట్ తేదీ ముందుకు
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. అయితే 2017 నుండి ఈ తేదీని మార్చారు దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఆ సంవత్సరం బడ్జెట్‌ను 2017 ఫిబ్రవరి 1వ తేదీకి మార్చారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1వ తేదీ నాటికి మొత్తం బడ్జెట్ ప్రాసెస్ పూర్తి కావడానికి బడ్జెట్ తేదీని ముందుకు జరిపారు.

బడ్జెట్ ఏకీకరణ
గతంలో రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ వేర్వేరుగా ఉండేవి. 1924 నుండి ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే 2016 నుండి రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో కలిపేశారు. తొమ్మిది దశాబ్దాల తర్వాత ఇలా ఏకీకరణ చేశారు.

బ్రీఫ్ కేసు
ఫిబ్రవరి 1, 2021లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్రీఫ్ కేసుకు బదులు టాబ్లెట్‌తో దర్శనం ఇచ్చారు. ఇది మొదటి డిజిటల్ బడ్జెట్. దేశంలో కరోనా కేసులు పెరగడంతో అప్పుడు డిజిటల్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. జూలై 5, 2019 సంప్రదాయ బ్రీఫ్ కేసుకు బదులు రెడ్ క్లాత్ బ్యాగ్‌తో దర్శనమిచ్చారు. అందులో బడ్జెట్ సంబంధిత డాక్యుమెంట్స్ తీసుకు వచ్చారు.

ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి
2015లో మోడీ ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి, నితి అయోగ్‌ను ఏర్పాటు చేసింది. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్ర భారతానికి ప్రధానమంత్రి అయినప్పుడు తొలిసారి పంచవర్ష ప్రణాళికకు ముగింపును కూడా ఇది సూచిస్తుంది. చివరి పంచవర్ష ప్రణాళిక 2012-17.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications