అత్యవసర ఆర్థిక అవసరాల సమయంలో మీరు పర్సనల్ లోన్ ఎందుకు పరిగణించాలో 4 కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్థిక అత్యవసర సమయాల్లో పర్సనల్ లోన్ తీసుకోవటం లైఫ్‌సేవర్‌గా ఉంటుంది. ఇది వ్యక్తులు ఎలాంటి తాకట్టు పెట్టకుండా వెంటనే నిధులను రుణం రూపంలో పొందేందుకు అవకాశాన్ని అందిస్తుంది. దీనిని చాలా మంది ఎంచుకునే ఆప్షన్. బజాజ్ ఫైనాన్స్ నుంచి పర్సనల్ లోన్ తక్షణ ఆమోదం, వేగంగా నిధుల పంపిణీని అందిస్తోంది. అత్యవసర సమయాల్లో లేదా త్వరితగతిన నిధులు అవసరమయ్యే సందర్భాల్లో ఇది ఉత్తమమైన ఎంపిక. పర్సనల్ లోన్ తీసుకోవటం సరైన ఎంపికని సూచించే నాలుగు బలమైన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం:
1. వేగంగా నిధుల లభ్యత: పర్సనల్ లోన్స్ అందించే అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి నిధులను త్వరగా అందించటం. లోన్ దరఖాస్తు ఆమోదించబడిన తర్వాత కేవలం కొన్ని రోజుల్లోనే సదరు వ్యక్తి బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేయబడుతుంది. ఇది మీ అత్యవసర ఆర్థిక అవసరాలను వెంటనే తీర్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ విషయంలో ఆమోదం పొందిన 24 గంటలలోపు* నిధులు అందించబడతాయి.

2. పూచీకత్తు అవసరం లేదు: హోమ్ లోన్ లేదా కార్ లోన్ వంటి రుణాల మాదిరిగా కాకుండా.. పర్సనల్ లోన్ విషయంలో ఎలాంటి తాకట్టు లేదా పూచీకత్తు అవసరం ఉండదు. దీని ప్రకారం వ్యక్తులు వారి ఆస్తులను రిస్క్ చేయకుండానే అవసరాలకు డబ్బును పొందవచ్చు. ఇది చాలా మంది వ్యక్తులకు సురక్షితమైన ఎంపికగా ఉంది.
3. ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్స్: పర్సనల్ లోన్స్ సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్‌లను రుణ గ్రహీతలకు అందిస్తాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా లోన్ డ్యూరేషన్ ఎంచుకోవచ్చు. ఈ క్రమంలో మీరు లోన్‌ను త్వరగా తిరిగి చెల్లించడానికి తక్కువ కాల వ్యవధిని లేదా నెలవారీ EMI మెుత్తాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువ కాల వ్యవధిని ఎంచుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ నుంచి పర్సనల్ లోన్‌తో మీరు గరిష్ఠంగా 96 నెలల కాలవ్యవధికి రుణాన్ని పొందవచ్చు.
4. క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుస్తుంది: పర్సనల్ లోన్ సకాలంలో తిరిగి చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండటం మిమ్మల్ని భవిష్యత్తులో ఎక్కువ లోన్ మొత్తాలు పొందేందుకు అర్హులుగా మారుస్తుంది. దీనికి తోడు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్‌లను పొందే అవకాశాలను మెరుగుపరుస్తుంది.
బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ ఫీచర్లు
మీ అత్యవసర అవసరాలను నిర్వహించడానికి బజాజ్ ఫైనాన్స్ నుంచి పర్సనల్ లోన్ ఉత్తమ ఎంపికగా మార్చే 4 ఫీచర్ల గురించి తెలుసుకుందాం:
- కేవలం 5 నిమిషాల్లో ఆమోదం: బజాజ్ ఫైనాన్స్‌తో మీ లోన్ అప్లికేషన్‌పై తక్షణ ఆమోదం పొందండి. ప్రక్రియను అవాంతరాలు లేకుండా త్వరితగతిన చేస్తుంది.
- త్వరిత పంపిణీ: మీరు ఆమోదం పొందిన 24 గంటలలోపు* నిధులను పొందవచ్చు.
- అధిక రుణ మొత్తం: రుణ దరఖాస్తుదారులు తమ పెద్ద లేదా చిన్న ఖర్చులను నిర్వహించడానికి రూ.40 లక్షల వరకు నిధులను పొందవచ్చు.
- తక్కువ డాక్యుమెంటేషన్: నిధులను పొందడానికి కేవలం కొన్ని బేసిక్ డాక్యుమెంటేషన్ సమర్పించాలి.
బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ పొందడానికి అవసరమైన అర్హతలు, డాక్యుమెంట్స్
పర్సనల్ లోన్ కోసం అప్లై చేసే ముందు మీ అర్హత, అవసరమైన డాక్యుమెంట్‌లను చెక్ చేసుకోవడం చాలా అవసరం. బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ పొందడానికి కొన్ని ప్రాథమిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి:
• జాతీయత: భారతీయుడు
• వయస్సు: 21 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు*
• ఉద్యోగం: పబ్లిక్, ప్రైవేట్ లేదా ఎమ్ఎన్‌సీ
• సిబిల్ స్కోర్: 685 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు
• నెలవారీ జీతం: ప్రారంభం రూ.25,001, మీరు నివసిస్తున్న నగరం ఆధారంగా
*లోన్ మెచ్యూరిటీ సమయంలో అధిక వయో పరిమితి వర్తిస్తుంది.
అదనంగా మీరు లోన్ మొత్తం, కాలపరిమితి, వడ్డీ రేటు ఆధారంగా చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్‌ని ఉపయోగించవచ్చు. ఇది మీ రీపేమెంట్ బడ్జెట్‌కు సౌకర్యవంతంగా సరిపోయే లోన్ మొత్తాన్ని ఎంచుకోవడంలో సహాయపడుతుంది.
వ్యక్తులకు అత్యవసర సమయాల్లో పర్సనల్ లోన్ విలువైన ఆర్థిక సాధనంగా ఉంటుంది. అయితే అప్పుల ఊబిలో పడకుండా ఉండేందుకు బాధ్యతాయుతంగా లోన్ తీసుకోవడం, సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించడం చాలా ముఖ్యం.
*షరతులు వర్తిస్తాయి
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications