Samvat 2081: రేపే ముహురత్ ట్రేడింగ్. దీనికోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా బ్రోకరేజ్ సంస్థలు మార్కెట్ వాటా లాభాలు, మౌలిక సదుపాయాల వ్యయం, డివిడెండ్ రాబడులు, అధిక బంగారం ధరలు వంటి కారణాలను పరిగణలోకి తీసుకుని కొన్ని షేర్లను సంవత్ 2081 కోసం సూచిస్తున్నారు. అయితే తాజాగా ఎస్బీఐ సెక్యూరిటీస్ సైతం మార్కెట్లోని పెట్టుబడిదారులకు కొన్ని షేర్లను సూచించింది.
ప్రస్తుతం దేశీయ వృద్ధి కథనం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి దేశాన్ని ముందుకు తీసుకువెళుతోంది. నిఫ్టీ 50 కంపెనీలు FY24-FY26లో 11.8 శాతం సగటు ఆదాయ వృద్ధిని అందించడానికి సిద్ధంగా ఉన్నాయని బ్రోకరేజ్ పేర్కొంది. సంవత్ 2080లో బెంచ్ మార్క్ సూచీలు రికార్డులను బద్ధల కొడుతూ సరికొత్త గరిష్టాలకు చేరిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ముందుగా బ్రోకరేజ్ ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటోపై తన దృష్టిని సారించింది. ఇటీవలి రెండవ త్రైమాసికంలో సైతం జొమాటో బలమైన వృద్ధితో లాభదాయకతను నమోదు చేసింది. కొత్త నగరాల్లోకి ప్రవేశించడం, ఇప్పటికే ఉన్న మార్కెట్‌లలో తన ఉనికిని మరింతగా పెంచుకోవడం ద్వారా బ్లింకిట్‌ను దూకుడుగా విస్తరించడంపై కంపెనీ దృష్టి సారిస్తోంది. పెద్ద డార్క్ స్టోర్లు, ఉత్పత్తుల శ్రేణిని పెంచటం వంటి చర్యలతో క్విక్ కామర్స్ రంగంపై పెద్ద ఆటకు కంపెనీ సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే వ్యూహాత్మకంగా నిధుల సమీకరణను చేపడుతోంది. కొత్త డార్క్ స్టోర్‌లు చాలా వేగంగా GOV పరంగా బ్రేక్‌ఈవెన్‌కి చేరుకుంటున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల జొమాటో పేటీఎం నుంచి టికెటింగ్ వ్యాపారాన్ని రూ.2000 కోట్లతో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రానున్న కాలంలో స్టాక్ ధర రూ.370కి చేరుకుంటుందని పలు బ్రోకరేజీలు ఇప్పటికే అంచనా వేశాయి.
ఇక ఎస్బీఐ సెక్యూరిటీస్ ఎంపిక చేసిన రెండవ స్టాక్ హడ్కో. HUDCO ఇటీవలి పునర్విభజన NBFC-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీగా పునరుత్పాదక ఇంధనం మరియు స్మార్ట్ సిటీలతో సహా హౌసింగ్‌కు మించిన విస్తృత శ్రేణి ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సహాయం చేస్తుంది. దీని తర్వాత ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్ ఇండియా షేర్లపై తన సానుకూలతను అందించింది. మైనింగ్ కంపెనీ FY25కి 838 MNTల ఉత్పత్తి లక్ష్యం మరియు FY26 నాటికి ప్రతిష్టాత్మకమైన 1 బిలియన్ టన్నులతో రికార్డ్-బ్రేకింగ్ వృద్ధి కోసం ట్రాక్‌లో ఉంది. కోల్ ఇండియా బొగ్గులో 81% విద్యుత్ రంగానికి వెళుతుంది కాబట్టి, పవర్ అండ్ స్టీల్ వంటి ముఖ్యమైన పరిశ్రమలలో స్థిరమైన డిమాండ్‌తో కంపెనీ లాభపడుతుందని విశ్లేషకులు అంటున్నారు.
ఎస్బీఐ ఈసారి సంవత్ 2081 కోసం ఎంపిక చేసిన షేర్లలో ఆర్ఈసీ కూడా ఉంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ సంస్థ ఎనర్జీ, మౌలిక సదుపాయాల విభాగాలపై దృష్టి సారిస్తోంది. గడచిన నాలుగేళ్లలో కంపెనీ లాభాలు ఏకంగా 10 రెట్లు పెరుగుదలను చూశాయి. గత నాలుగు సంవత్సరాల్లో స్టాక్ గణనీయమైన రీ-రేటింగ్‌ను చూసినప్పటికీ, స్టాక్‌పై సంస్థాగత ఆసక్తి ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. ఇక ఈ దీపావళికి చివరిగా ఎంపికైన షేరు ముత్తూట్ ఫైనాన్స్. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు సైతం భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్న వేళ ఇతర రాజకీయ వద్రిక్తతలు పసిడి ధరలను భారీగా పెంచుతున్న సంగతి తెలిసిందే. దీంతో గోల్డ్ లోన్ సంస్థలు రుణాలను అందించటం కూడా వేగవంతం చేశాయి. కొత్త కస్టమర్లను పెంచుకునేందుకు కంపెనీ ఏటా 150-200 కొత్త బ్రాంచీలను సైతం ఓపెన్ చేస్తోంది. దీంతో భవిష్యత్తుపై బ్రోకరేజ్ ఆశాజనకంగా ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications