టాప్ టెన్‌లోని ఐదు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ఏడాది రూ.62,508.32 కోట్లు ఎగిసింది. గతవారం భారీగా లాభపడిన స్టాక్స్‌లో భారతీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంది. హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్, HDFC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ తదితరాలు ఉన్నాయి. అదే సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. అంతకుముందు వారం టాప్ 10 మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీల్లోని 9 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,93,804.34 కోట్లు పెరిగింది. అప్పుడు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అదరగొట్టింది. వరుసగా రెండో వారం భారీగా పెరిగింది. 30 షేర్ బీఎస్ఈ బెంచ్‌మార్క్ గత వారం 175.12 పాయింట్లు లేదా 0.30 శాతం లాభపడింది. అంతకుముందు వారం సెన్సెక్స్ 2,005.23 పాయింట్లు లేదా 3.57 శాతం లాభపడింది. సెన్సెక్స్ మొదటిసారి పది రోజుల క్రితం శుక్రవారం 58,000 మార్కు దాటింది. అంతకుముందు వారం టాప్ 10 కంపెనీల్లో ఇన్ఫోసిస్ మాత్రమే నష్టపోయింది. మిగతా తొమ్మిది కంపెనీలు లాభాల్లో ముగిశాయి. ఈసారి మాత్రం 5 నష్టపోగా, ఐదు లాభపడ్డాయి.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23,582.73 కోట్లు పెరిగి రూ.15,37,600.23 కోట్లకు చేరుకుంది. టాప్ టెన్ కంపెనీల్లో అత్యధికంగా లాభపడిన కంపెనీ రిలయన్స్. అంతకుముందు వారం అయితే రిలయన్స్ మార్కెట్ క్యాప్ ఏకంగా గతవారం రూ.1,02,382 కోట్లు ఎగిసింది.

- భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.15,377.67 కోట్లు ఎగిసి రూ.3,76,917.83 కోట్లకు చేరుకుంది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.12,836.43 కోట్లు ఎగిసి రూ.5,11,126.48 కోట్లకు చేరుకుంది.
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.9,997.52 కోట్లు ఎగిసి రూ.6,59,941.45 కోట్లకు చేరుకుంది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.713.97 కోట్లు ఎగిసి రూ.3,85,721.71 కోట్లకు చేరుకుంది.
ఇక, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్స్ నష్టపోయాయి. ఇన్ఫోసిస్ అంతకుముందు వారం కూడా నష్టపోయింది. గతవారం నష్టపోయిన స్టాక్స్‌లో బ్యాంకింగ్ ఎక్కువగా ఉన్నాయి.
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.18,347.3 కోట్లు క్షీణించి రూ.14,02,587.80 కోట్లకు చేరుకుంది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.5,824.68 కోట్లు తగ్గి రూ.4,48,383.08 కోట్లకు చేరుకుంది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,429.22 కోట్లు క్షీణించి రూ.8,67,933.20 కోట్లకు తగ్గింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మరోసారి క్షీణించింది. గతవారం రూ.3,605.59 కోట్లు క్షీణించి రూ.7,17,639.19 కోట్లకు తగ్గింది.
- ICICI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.3,013.49 కోట్లు తగ్గి రూ.4,99,218.97 కోట్లకు చేరుకుంది.
సెన్సెక్స్ గతవారం 58,305 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం వినాయక చవితి సందర్భంగా శుక్రవారం సెలవు ఉంది. నాలుగు సెషన్‌లు కూడా ఎక్కువగా ఊగిసలాటలో ఉన్నాయి. చివరి సెషన్‌లో సెన్సెక్స్ 54.81 (0.094%) పాయింట్లు లాభపడింది. నిఫ్టీ చివరి సెషన్‌లో 15.75 (0.091%) పాయింట్లు ఎగిసి 17,369.25 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications