IPO News: కొత్తవారం 5 ఐపీవోల క్యూ.. గ్రేమార్కెట్లో దుమ్ము దులిపేస్తున్నాయ్, ఇన్వెస్టర్స్ త్వరపడండి..
Upcoming IPOs: దాదాపుగా ఏడాది కాలం నుంచి భారతీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. వచ్చిన వాటిలో దాదాపు 85 శాతం కంపెనీలు ఇన్వెస్టర్లకు మెుదటి రోజునే మంచి రిటర్న్స్ అందించాయి. అందుకే 2025లో కూడా కొనసాగుతున్న ఐపీవోల రద్దీ నుంచి మంచి రాబడులను అందుకోవాలని పెట్టుబడిదారులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రైమరీ మార్కెట్ 5 కొత్త ఐపీవోలతో రద్దీగా ఉండనుంది. పైగా వీటిలో ఒక మెయిన్ బోర్డ్ ఐపీవో కూడా ఉండటంతో పెట్టుబడిదారులు ఆసక్తిగా ఉన్నారు. మిగిలిన నాలుగు ఐపీవోలు ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్టింగ్ కోసం మార్కెట్లోకి వస్తున్నాయి.

- క్యాపిటల్ నంబర్స్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ ఐపీవో స్టాక్ మార్కెట్ల నుంచి రూ.169.37 కోట్లను సమీకరించాలని. ఈ ఐపీవో ద్వారా కంపెనీ 32.20 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచింది. వాస్తవానికి ఐపీవో జనవరి 20 నుంచి 22 వరకు సాధారణ ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉండనుంది. ఇందుకోసం కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.250-263గా నిర్ణయించింది. ప్రస్తుతం ఇష్యూ తెరచుకోనప్పటికీ పెట్టుబడిదారుల నుంచి వస్తున్న విశేష స్పందన కారణంగా గ్రేమార్కెట్లో కంపెనీ షేరుకు రూ.110 ప్రీమియం ధర పలుకుతోంది.
- రెక్స్‌ప్రో ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ ఐపీవో జనవరి 22 నుంచి సాధారణ పెట్టుబడిదారులు బెట్టింగ్ వేసేందుకు అందుబాటులోకి రానుంది. జనవరి 24 వరకు పెట్టుబడిదారులు బెట్టింగ్ వేయవచ్చని వెల్లడైంది. ఇందుకోసం కంపెనీ తన ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.145గా నిర్ణయించింది. ఈ క్రమంలో లాట్ పరిమాణాన్ని 1000 షేర్లుగా నిర్ణయించింది. దీనివల్ల రిటైల్ పెట్టుబడిదారులు ఎస్ఎమ్ఈ ఐపీవో కోసం కనీసం ఒక లాట్ కొనుగోలు చేయటానికి రూ.1.45 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి రానుంది.
- ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న మరో ఐపీవో CLN ఎనర్జీ. పెట్టుబడిదారుల కోసం కంపెనీ ఐపీవో జనవరి 23 నుంచి జనవరి 27 వరకు అందుబాటులో ఉంటుందని ప్రకటించబడింది. ఈ క్రమంలో లాట్ పరిమాణాన్ని 600 షేర్లుగా నిర్ణయించింది. అలాగే ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.235-250గా నిర్ణయించటంతో ఇన్వెస్టర్లు ఒక లాట్ కొనుగోలు కోసం దాదాపు రూ.1.50 లక్షలు కనీస పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
- ఎస్ఎమ్ఈ ఐపీవోలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వేళ జీబీ లాజిస్టిక్స్ కంపెనీ ఐపీవో గురించే. జనవరి 24 నుంచి 28 వరకు కంపెనీ ఐపీవో పెట్టుబడిదారులకు ప్రస్తుతం అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే కంపెనీ తాజా ఐపీవో ద్వారా దాదాపు 24.58 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించాలని చూస్తోంది.
- ఇక చివరిగా రానున్న వారంలో వస్తున్న ఐపీవో డెంటా వాటర్ కంపెనీదే. మెయిన్ బోర్డ్ కేటగిరీ కింద వస్తున్న ఐపీవో జనవరి 22 నుంచి జనవరి 24 వరకు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలో కంపెనీ తన ప్రైస్ బ్యాండ్ ధరను రూ.279-290గా నిర్ణయించింది. దీంతో లాట్ పరిమాణాన్ని 50 షేర్లుగా ఉంచగా.. పెట్టుబడిదారులు కనీసం రూ.14,700 ఇన్వెస్ట్ చేయాల్సి రానుంది. అయితే ఐపీవోకు కొనసాగుతున్న క్రేజ్ కారణంగా ప్రస్తుతం గ్రేమార్కెట్లో ఒక్కో షేరుకు రూ.110 ప్రీమియం పలుకుతోంది. అందుకే ఐపీవోపై బెట్టింగ్ వేయటానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.


Click it and Unblock the Notifications