హైదరాబాద్: ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన '30 అండర్ 30' ఆసియా జాబితాలో ఐదుగురు హైదరాబాదీలు చోటు దక్కించుకున్నారు. వారిని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. ఆసియాలో 30 ఏళ్ల లోపు వయస్సున్న 30 మందిని ఫోర్బ్స్ గుర్తించింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్తలకు ఐదుగురికి చోటు దక్కింది.

5గురు హైదరాబాదీలు వీరే..
ఫోర్బ్స్ జాబితాలో ప్రేమ్ కుమార్ (మారుత్ డ్రోన్స్), అశ్విన్ మోచర్ల (దీ థిక్ షేక్ ఫ్యాక్టరీ), సందీప్ బొమ్మి (యాడ్ ఆన్ మో), విహారి (అర్బన్ కిసాన్), పవన్ కుమార్ చందన (స్కై రూట్ ఏరోస్పేస్)కు చోటు దక్కింది. ప్రస్తుత కాలంలో 30 ఏళ్ల లోపు జీవితంలో సెటిల్ కావడం లేదా ఉద్యోగం సంపాదించుకోవడమే కాస్త కష్టంగా మారింది. కానీ వీరికి మాత్రం ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కింది. తాజాగా 30 under 30 జాబితాను విడుదల చేసింది.

ఇండియా నుండి 69 మంది
10 విభాగాల్లో 30 మంది చొప్పున మొత్తం 300 మంది ఆ జాబితాలో ఉన్నారు. మొత్తం 22 దేశాల్లో భారత్ నుండే ఎక్కువ మందికి చోటు దక్కింది. మన దేశం నుండి 69 మంది చోటు దక్కించుకున్నారు.

ఈ 10 విభాగాల్లో..
ఆర్ట్స్ అండ్ స్టైల్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ, ఫైనాన్స్-వెంచక్ కేపిటల్, ఇండస్ట్రీ-మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ఎనర్జీ, రిటైల్ ఈ కామర్స్, కన్స్యూమర్ టెక్నాలజీ, మీడియా-మార్కెటింగ్-అడ్వర్టయిజ్మెంట్, వినోదం స్పోర్ట్స్, హెల్త్ కేర్ అండ్ సైన్స్, సోషియల్ ఎంటర్ ప్రెన్యూర్.. ఈ 10 విభాగాల్లో ఒక్కో విభాగానికి 30 మంది చొప్పున 30 ఏళ్ల లోపు వారిని ఫోర్బ్స్ ఎంపిక చేసింది.
కేటీఆర్ ప్రశంస
వీరిని కేటీఆర్ ప్రశంసించారు. ఇది ఎంతో గర్వకారణమన్నారు. ఈ తరంలోని యువకులు తమ ఆలోచనలకు అనుగుణంగా అద్భుతమైన ఆవిష్కరణలు, వినూత్న మార్గాల్లో పురోగమిస్తున్నారన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్, వీ హబ్ వంటి కార్యక్రమాల ద్వారా హైదరాబాద్ నగర స్టార్టప్ వాతావరణం బలోపేతమైందన్నారు. ఐదుగురు పారిశ్రామికవేత్తలు ఆయా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించారు. ఇందులో పలు స్టార్టప్స్ టీ-హబ్ ద్వారా ప్రారంభమయ్యాయి. లేదా టీ-హబ్ ద్వారా సహాయసహకారాలు అందుకున్నవి.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

Hyderabad: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్? బడ్జెట్ తర్వాత మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications