మ్యూచువల్ ఫండ్స్ అనగానే చాలా మందికి ఒకే ఆలోచన "టాప్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్‌లో డబ్బు పెట్టేస్తే చాలు!" అనిపిస్తుంది. కానీ నిజానికి ఆలోచించకుండా వేసిన అడుగు తర్వాత రోజుల్లో పశ్చాత్తాపానికి తెస్తుంది.
ఇన్వెస్ట్‌మెంట్ అంటే కేవలం డబ్బు పెడితే సరిపోదు, ప్లానింగ్ కూడా అవసరం. ఈ క్రింది 5 తప్పులు చాలామంది ఇన్వెస్టర్లు చేసే కామన్ మిస్టేక్స్. మీరు వీటిని తప్పించుకుంటే మీ పెట్టుబడులు సేఫ్‌గా ఉండి, మీ ఫైనాన్షియల్ లక్ష్యాలకు దగ్గర చేస్తాయి.

1. స్పష్టమైన లక్ష్యాలు లేకుండా ఇన్వెస్ట్ చేయడం:
చాలామంది "ఫ్రెండ్ చెప్పాడు, యూట్యూబ్‌లో విన్నాను, సోషల్ మీడియాలో చదివాను" అంటూ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఎలాంటి లక్ష్యం లేకుండా పెట్టిన డబ్బు ఎక్కడికో వెళ్తుంది. మీరు పెళ్లి, పిల్లల చదువు, రిటైర్మెంట్, కొత్త ఇల్లు లాంటి లక్ష్యాలను ముందే నిర్ణయించుకుంటే ఏ ఫండ్‌లో ఎంతకాలం పెట్టాలో క్లియర్ అవుతుంది. ఇలా చేస్తే SIP కూడా సరిగ్గా ప్లాన్ చేసుకోవచ్చు.
2. గత రాబడులపై మోజు పడటం:
"ఈ ఫండ్ గత 3 ఏళ్లలో సూపర్‌గా పెరిగింది కాబట్టి ఇంకా పెరుగుతుంది" అనుకోవడం చాలా పెద్ద తప్పు. గతంలో రాబడి ఇచ్చిన ఫండ్ రేపు కూడా అదే చేస్తుందని ఎవరూ హామీ ఇవ్వలేరు. ఫండ్ మేనేజర్ స్ట్రాటజీ, మార్కెట్ సిట్యువేషన్, రిస్క్ ప్రొఫైల్ ఇవన్నీ చూడకుండా కేవలం పాత రిటర్న్స్ ఆధారంగా ఇన్వెస్ట్ చేస్తే నష్టమే ఎక్కువ.
3. ఖర్చులు & ఫీజులు పట్టించుకోకపోవడం:
మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బు పెట్టినంత మాత్రాన రాబడి మొత్తం మీదే కాదు. వీటిలో కొన్ని ఖర్చులు, ఫీజులు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఖర్చు నిష్పత్తి, మేనేజ్‌మెంట్ ఫీజులు, ట్రాన్సాక్షన్ ఛార్జీలు వంటివి. ఇవన్నీ కలిపి మీ రాబడిలోంచి కట్ అవుతాయి. చాలా మందికి "ఇవి చిన్న తేడాలు మాత్రమే" అనిపించినా, దీర్ఘకాలంలో అవే పెద్ద నష్టంగా మారతాయి. అందుకే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసేముందు ఈ ఖర్చులు ఎంత ఉన్నాయో చెక్ చేయడం తప్పనిసరి.
4. భావోద్వేగాలకు లొంగిపోవడం:
అది చాలా మంది చేసే కామన్ మిస్టేక్. మార్కెట్ పడిపోయిందంటే భయపడి వెంటనే ఫండ్స్ అమ్మేస్తారు. "ఇంకా పడిపోతే నష్టమవుతుందేమో" అని టెన్షన్ పడతారు. అలానే మార్కెట్ పెరిగితే ఎగ్జైట్ అయ్యి వెంటనే కొత్త ఫండ్స్ కొనేస్తారు. కానీ ఇలాంటివి చేసినంత మాత్రాన మీరు లాంగ్‌టర్మ్‌లో వచ్చే కాంపౌండింగ్ బెనిఫిట్స్‌ని కోల్పోతారు.
మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక్కరోజు, ఒక్కసంవత్సరం ఆట కాదు. ఇది దీర్ఘకాలం పట్టే గేమ్. ఇక్కడ సహనం, స్థిరత్వం చాలా ముఖ్యం. మార్కెట్ ఎప్పుడూ ఎత్తుపల్లాలతోనే ఉంటుంది. కాబట్టి ఒకసారి పెరిగిందని ఎగ్జైట్ కావడం, ఒకసారి పడిపోయిందని భయపడటం కంటే లాజిక్‌తో, ప్రాపర్ ప్లానింగ్‌తో, మీ ఫైనాన్షియల్ గోల్స్‌కి తగ్గట్టు పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది.
5. డైవర్సిఫికేషన్ లేకపోవడం:
చాలామంది ఇన్వెస్టర్లు ఒకే రంగం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఉదాహరణకు టెక్ కంపెనీలు బాగా నడుస్తున్నాయంటే కేవలం టెక్ ఫండ్స్‌లోనే ఎక్కువ డబ్బు పెట్టేస్తారు, లేదా బ్యాంకింగ్ బూమ్‌లో ఉంటే కేవలం ఆ రంగంలోనే ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇది చాలా రిస్కీ. ఎందుకంటే ఆ రంగం కిందపడ్డ వెంటనే మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ కూడా డౌన్ అవుతుంది.
అందుకే డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే మీ పోర్ట్‌ఫోలియోలో కేవలం ఒక రంగం లేదా ఒక ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే కాకుండా, ఈక్విటీలు, రియల్ ఎస్టేట్, స్థిర డిపాజిట్లు, బంగారం లాంటి వేర్వేరు ఆప్షన్లు ఉండాలి. ఇలా విభజించి పెట్టుబడి పెడితే ఒక చోట లాస్ అయినా ఇంకో చోట గెయిన్ కవర్ చేస్తుంది. "అన్ని గుడ్లను ఒకే బుట్టలో వేయొద్దు" అన్న మాటే ఇది.
పెద్ద క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఏ ఫండ్ అయినా రిస్క్ లేకుండా ఉండదు. కానీ ఈ 5 తప్పులు తప్పించుకుంటే మీరు స్మార్ట్ ఇన్వెస్టర్ అవుతారు. అలాగే చివర్లో ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకుంటే, మీ డబ్బు మరింత సేఫ్‌గా ఉంటుంది. గుర్తుంచుకోండి పెట్టుబడి అనేది "ఫాస్ట్ గేమ్" కాదు, "లాంగ్ జర్నీ." సరైన దిశలో మొదలు పెడితే, గమ్యం దగ్గర మీరు సేఫ్‌గా చేరతారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications