Mahakumbh 2025: చాలా మంది ప్రస్తుత కాలంలో సీజనల్ వ్యాపారాలను చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. దీనికి కారణం తక్కువ సమయంలోనే అధిక రాబడులను పొందటానికి వీలు ఉండటం. అలాంటి వ్యాపార అవకాశాలు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న మహాకుంభమేళా సమయంలో వైరల్ అవుతున్నాయి. వీటితో సక్సెస్ పక్కా అని వినిపిస్తోంది.
యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. పుణ్య స్నానం ఆచరించాలని వారు తహతహలాడుతున్నారు. దాదాపుగా 2025లో 45 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో 45 కోట్ల మంది పాల్గొంటారని అంచనా ఉంది. ఇక్కడ తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించటానికి 5 వ్యాపార అవకాశాలు ఉన్నాయి.

1. ప్రజలు మహాకుంభ్ సమయంలో ప్రయాగ్‌రాజ్ సంగమంలో స్నానం చేసి బయటకు వస్తారు. అలా వచ్చే వారికి చందనం సువాసన పూస్తే ప్రతి ఒక్కరికీ రూ.10 సూలు చేయవచ్చు. దీనిని సహజంగా అనేక హిందూ దేవాలయాల వద్ద కూడా చూస్తూనే ఉంటాం. తక్కువ పెట్టుబడితో రోజుకు 10 నుంచి 20 వేల రూపాయలు దీని ద్వారా సంపాదించవచ్చని ఒక యువకతుడు అక్కడ చేసి చూపిస్తున్నాడు. దీనికోసం రోజుకు కనీసం 1000 మందికి పైగానే భక్తులను చేరుకోవాల్సి ఉంటుంది.
2. అసలే చలికాలం. అందులోనూ కుంభమేళాలో స్నానం. ఇలాంటి సమయంలో ఎవరైనా సహజంగా చూసేది ఒక మంచి టీ లేదా కాఫీ కోసమే. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో ప్రజలు తప్పకుండా టీ తాగటాన్ని ఒక యువకుడు వ్యాపారంగా మార్చుకున్నాడు. ఒక్కో టీ కనీసం రూ.10-15 చొప్పున విక్రయించినా రోజుకు సులువుగా 500 వరకు టీలు విక్రయించవచ్చు. దీనిద్వారా స్థిరంగా రోజుకు రూ.5 వేలు సంపాదించవచ్చని సదరు యువకుడు చెబుతున్నాడు. కొందరైతే ఫ్యామిలీ మెుత్తం ఇదే వ్యాపారం చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు.
3. ప్రయాణం చేసి తిరుగుతూ అలసిపోయిన భక్తులకు ఒక మంచి స్నాక్స్ ఎల్లప్పుడూ నచ్చుతుంది. అందుకే ఒక యువకుడు గుగ్గిళ్లతో టమాటా, నిమ్మకాయ, మిర్చి వేసి చాట్ చేసి విక్రయిస్తున్నాడు. చల్లటి వాతావరణంలో వేడిగా దీనిని తినటం చాలా మంది ఇష్టపడుతుంటారని మనందరికీ తెలిసిందే. దీనికి కొద్దిగా ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం ఉంటుంది. మంచి రుచికరంగా చేస్తే మాత్రం భారీగా గిరాకీ అవుతుంది.
4. మహాకుంభంలో చిన్నచిన్న వ్యాపారులు కూడా పెద్ద బిజినెస్ చూస్తున్నారు. ఇది జరిగే 45 రోజుల కోసం వారు చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక యువకుడు చాట్ బండి పెట్టాడు. కార్పొరేట్ ఉద్యోగాలు వద్దు వ్యాపారం స్టార్ట్ చేయండి అంటూ ఆ యువతకుడు పిలుపునిచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాపారం చేయండి అంటూ అందరికీ పిలుపునిస్తున్నాడు.
5. ఇక చివరిగా నమకీన్స్ అమ్ముతున్న మరో యువకుడి వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రియమైన వారితో అక్కడికి వచ్చే ప్రజలు నడుస్తూ తమకు నచ్చిన హాట్స్, నమ్కీన్స్ తింటుంటారు. అందుకే మహాకుంభ్ లాంటి చోట ఇలాంటి వ్యాపారం ఉత్తమమైనదిగా సదరు యువకుడు పిలుపునిస్తున్నాడు. కోట్ల మంది వచ్చే చోట చిన్న వ్యాపారం కూడా లక్షల్లో రాబడిని తెచ్చిపెడుతుందని చాలా మంది యువత భావిస్తున్నారు. వెంటనే లేటు చేయకుండా సదవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications