FD Rates: అధిక వడ్డీ రేట్లకు కాలం త్వరలోనే చెల్లిపోనుంది. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కొత్త ఏడాదిలో వడ్డీ రేట్లను తగ్గించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే ఎఫ్‌డి ఇన్వెస్టర్లకు చివరి సదవకాశంగా తెలుస్తోంది.
2024 ప్రారంభానికి కొన్ని రోజుల ముందర దేశంలోని 5 బ్యాంకులు తమ కస్టమర్లకు నూతన సంవత్సర కానుకను అందించాయి. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి స్టేట్ బ్యాంక్ వరకు అనేక సంస్థలు తమ వడ్డీ రేట్లను పెంచాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా: డిసెంబర్ నెలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా పెంచుతున్నట్లు ప్రకటించింది. BoB వివిధ పదవీకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల నుంచి గరిష్ఠంగా 125 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త వడ్డీ రేట్లను డిసెంబర్ 29, 2023 నుంచి రూ.2 కోట్ల కంటే తక్కువ FDల కోసం పెంచుతున్నట్లు ప్రకటించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఇటీవల స్టేట్ బ్యాంక్ కూడా రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 7-45 రోజుల ఎఫ్‌డిపై 0.50 శాతం పెంచగా.. 46-179 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 0.25 శాతం మేర బ్యాంక్ పెంచింది. అలాగే 180-210 రోజుల FDపై వడ్డీ రేటు కూడా 0.50 శాతం పెరిగింది. దేశంలో అతిపెద్ద పబ్లిక్ బ్యాంక్ తన కొత్త వడ్డీ రేట్లను డిసెంబర్ 27, 2023 నుంచి అమలులోకి తీసుకొచ్చింది.
కోటక్ మహీంద్రా బ్యాంక్: FDలపై వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకుల జాబితాలో ప్రైవేటు రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా నిలిచింది. 3-5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై వడ్డీ రేట్లు పెంచబడ్డాయి. ఇప్పుడు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే కస్టమర్‌లకు సాధారణ కస్టమర్లకు 2.75 శాతం నుంచి 7.25 శాతం, అలాగే సీనియర్ సిటిజన్లకు 3.35 శాతం నుంచి 7.80 శాతం వరకు వివిధ కాల వ్యవధులకు వడ్డీని ఆఫర్ చేస్తోంది.
డిసిబి బ్యాంక్: డిసిబి బ్యాంక్ కూడా రూ.2 కోట్ల కంటే తక్కువ మెుత్తాలికి ఎఫ్‌డిలపై వివిధ కాలాలకు వడ్డీ రేట్లను మార్చింది. కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 13 నుంచి అమలులోకి వచ్చాయి. ఏడు రోజుల నుంచి 10 ఏళ్లలో మెచ్యూర్ అయ్యే FDలపై సాధారణ కస్టమర్లకు ఇప్పుడు 3.75 శాతం నుంచి 8 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఈ కాలానికి బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం నుంచి 8.60 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది.
ఫెడరల్ బ్యాంక్: ప్రైవేటు రంగంలోని ఫెడరల్ బ్యాంక్ 500 రోజుల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే కస్టమర్లకు వడ్డీ రేట్లను పెంచింది. డిసెంబర్ 5, 2023 నుంచి కొత్త వడ్డీ రేట్లను అమలులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ గరిష్ఠంగా 7.50 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ కాలానికి పెట్టుబడి పెట్టే సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 8.15 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 21 నెలల నుంచి మూడేళ్ల లోపు ఎఫ్‌డీలపై సాధారణ కస్టమర్లకు 7.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తోంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications