Bangalore rents: ఐటీ హబ్ బెంగళూరులో ఇంటి అద్దెలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఆ రెంట్స్ వింటేనే సామాన్య మధ్యతరగతి ప్రజలు నోరెళ్లబెట్టాల్సిందే. ఇవి ఒక ఎత్తయితే ఇంట్లో అద్దెకు దిగే ముందు భారీ మొత్తంలో డిపాజిట్ సైతం సమర్పించాల్సి ఉంటుంది. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ డిపాజిట్ అమౌంట్, రెంటు చూసి ప్రజలు అవాక్కవుతున్నారు.
దేశీయ సిలికాన్ వ్యాలీగా ప్రఖ్యాతి గాంచిన బెంగళూరులో ఇంటి అద్దెలు.. US సిలికాన్ వ్యాలీకి ఏమాత్రం తక్కువ కాదు. తేజస్వి శ్రీవాస్తవ అనే వ్యక్తి చేసిన ఈ ట్వీట్ దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. తన 4 BHK ఫ్లాట్ రెంట్ కు ఇచ్చేందుకు ఓ ఇంటి యజమాని సెక్యూరిటీ డిపాజిట్ గా 25 లక్షలతో పాటు ప్రతి నెలా అద్దె కింద 2.5 లక్షలు చెల్లించాలంటూ లిస్ట్ చేసిన స్క్రీన్ షాట్ ను తేజస్వి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

బెంగళూరులోని HSR లేఅవుట్ ప్రాంతంలో ఈ ఇల్లు ఉంది. నో బ్రోకర్ సహా పోష్ సొసైటీ ట్యాగ్‌లో కనిపించింది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. లిస్టింగ్‌లో డిపాజిట్ కాలమ్‌తో పాటు 'అప్లై లోన్' లింక్ కూడా ఉంది. 'కిడ్నీ డొనేషన్ అప్లికేషన్' లింక్ సైతం ఇక్కడ యాడ్ చేస్తే బాగుండేదంటూ శ్రీవాస్తవ కామెంట్ చేశారు.
నగరంలోని మరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అర్ష్ గోయల్ కూడా తన దుస్థితిని ఇటీవల ట్విట్టర్‌లో ద్వారా పంచుకున్నారు. తన ఇంటి యజమాని ఏడాదిలోపే అద్దెను 15 వేలు పెంచినట్లు చెప్పారు. ఒప్పందం ప్రకారం ఏటా 5 శాతం పెరుగుదల ఉండాలి, కానీ యజమాని చేసిన పని వల్ల.. ఆయన అడిగిన రెంట్ పే చేయడం లేదా మరో ఇల్లు వెతుక్కోవడం అనే ఈ రెండే ఆప్షన్స్ మాత్రమే తన ముందు ఉన్నట్లు వెల్లడించారు.
'మళ్లీ కొత్త ఇంటిని వెతక్కోవడం పెద్ద సమస్య. దానికి భారీ మొత్తం బ్రోకరేజీ, సమయం వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి యజమాని పెంచిన రెంటు అంగీకరించడం తప్ప మాకు వేరే మార్గం లేదు. సమీపంలోని సొసైటీలలో చాలా మంది ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. బెంగళూరులో ఇంటి అద్దెలు భవిష్యత్తులో ఏ రేంజ్ కి వెళతాయోనని ఆందోళన చెందుతున్నాం' అంటూ అర్ష్ విచారం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications