న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను నివారించడానికి పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌లోకి జారుకున్నాయి. తెలంగాణ సహా మెజారిటీ సంఖ్యలో రాష్ట్రాలు సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించాయి. ఈ పరిణామాలతో ఆయా రాష్ట్రాల ఆర్థిక వనరులు దెబ్బతిన్నాయి. రోజువారీ రాబడి గణనీయంగా క్షీణించింది. అదే సమయంలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు, వ్యాక్సిన్ కొనుగోలు, కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల ప్రాణాలను నిలపడానికి అదనంగా ఖజానా నుంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. అటు లాక్‌డౌన్ వల్ల అటు పరిశ్రమలు దెబ్బతిన్నాయి. క్రయ విక్రయాలు నిలిచిపోవడంతో ఉత్పత్తి దాదాపుగా స్తంభించిపోయింది.
లాక్‌డౌన్ తొలగిపోయి.. మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి సుదీర్ఘ సమయం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలతో ఆర్థికంగా కొట్టుమిట్టాడే స్థితికి చేరుకుంటోన్నాయి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. పులి మీద పుట్ర అన్నట్లు.. ఫుట్‌వేర్, గార్మెంట్స ఇండస్ట్రీస్ వంటి పరిశ్రమలపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా పన్ను పెంపుదలను ప్రతిపాదించింది. లాక్‌డౌన్ వల్ల తాళం పడిన ఆయా పరిశ్రమలపై కేంద్ర పన్ను పెంపును అమలు చేయడం సరికాదని, కొంతకాలం పాటు దాన్ని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాతే పన్ను పెంపు దిశగా ఆలోచన చేయాలని సూచించింది.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఫుట్‌వేర్, గార్మెంట్స్ వంటి చిన్న తరహా పరిశ్రమలపై ప్రతిపాదించిన పన్ను పెంపును తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని కోరారు. ఏపీలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించనప్పటికీ.. కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తోన్నామని, ఫలితంగా గ్రామీణ స్థాయిలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలపై ప్రభావం పడిందని పేర్కొన్నారు.
అలాగే సకాలంలో పన్నులను చెల్లించని వ్యాపారస్తులపై జరిమానా రూపంలో విధించే మధ్యంతర అధిక వడ్డీ మొత్తాన్ని కూడా తగ్గించాలని బుగ్గన సూచించారు. లాక్‌డౌన్ తరహా పరిస్థితుల వల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయని వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా తగ్గిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన జీఎస్టీ బకాయిల గురించి బుగ్గన ఈ భేటీలో ప్రస్తావించారు. రాష్ట్రాలకు మరింత ఆర్థిక సహాయన్ని అందించడానికి ఇంతకంటే మంచి సమయం లభించకపోవచ్చని ఆయన నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ను ఎదుర్కొనడానికి అవసరమైన నిధులను కూడా అడ్వాన్స్‌గా విడుదల చేయాలని సూచించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications