రిటైరైన కూడా క్రేజ్ తగ్గలేదు.. అమితాబ్,.షారుక్ కంటే మిస్టర్ కూల్ ధోనియే టాప్..
ఇండియాలో క్రికెట్ ప్లేయర్స్ కి, క్రికెట్ ఉన్న క్రేజ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే తాజా పరిశోధనలో బాలీవుడ్ స్టార్ల కంటే క్రికెటర్లే ఎక్కువ పాపులర్ సెలబ్రిటీలుగా నిలుస్తున్నారు.హంసా రీసెర్చ్ బ్రాండ్ ఎండోర్సర్ రిపోర్ట్ 2024 ప్రకారం, క్రికెటర్లు భారతదేశంలో ప్రముఖ బ్రాండ్ అంబాసిడర్‌లుగా బాలీవుడ్ హీరోలను సైతం అధిగమించారు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెట్ స్టార్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా బ్రాండ్ ప్రమోషన్స్ లో దూసుకెళ్తున్నారు.
2024లో 42 బ్రాండ్‌లతో (మొదటి ఆరు నెలల్లో) ధోనీ 41 బ్రాండ్‌లతో ఉన్న బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను కూడా అధిగమించి టిప్ బ్రాండ్ ప్రమోటర్గ్ కోనసాగుతున్నారు. TAM మీడియా రీసెర్చ్ నివేదిక ప్రకారం యూరోగ్రిప్ టైర్స్ మహీంద్రా సింగ్ ధోనిని బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడంతో బుధవారం ధోని టాప్ ప్లేస్లోకి మార్చింది.

ఈ సంవత్సరం ధోనీ ఫ్రెంచ్ కార్‌మేకర్ సిట్రోయెన్, డ్రోన్ టెక్ స్టార్టప్ గరుడ ఏరోస్పేస్, ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని క్లియర్‌ట్రిప్, పెప్సికో లేస్, క్రాస్-రివార్డ్ ప్రోగ్రామ్ ఆపరేటర్ Single.id, ఇ-సైకిల్ కంపెనీ EMotorad, ఫ్యూయల్ కార్డ్ సర్వీసెస్ ఇంకా ఆయిల్, కన్స్యూమర్ ఎలక్ట్రికల్ బ్రాండ్ ఓరియంట్ ఎలక్ట్రిక్, ఫిట్‌నెస్ అండ్ న్యూట్రిషన్ బ్రాండ్ ఎక్స్ప్లోజివ్ వేకి బ్రాండ్ ప్రమోటర్ గా ఉన్నారు.
ధోనీ ప్రొడక్ట్స్ కోసం మాత్రమే కాదు ఎన్నికల సందర్భంగా ఎన్నికలు, ఓటింగ్ పై కూడా ప్రజలకు అవగాహణ కల్పిస్తూ జార్ఖండ్ ఎలక్షన్లో ఎలక్షన్ కమిషన్ తో పనిచేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తర్వాత కూడా ధోని బ్రాండ్ వాల్యూ పెరుగుతోంది" అని TVS శ్రీచక్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మాధవన్ పార్థసారథి అన్నారు.
యూరోగ్రిప్ వంటి బ్రాండ్‌తో అనుబంధం కావడం నిజంగా ఆనందంగా ఉంది. బైక్స్ ఇంకా బైక్ రైడింగ్‌పై నా ఇష్టం నా క్రికెట్ ప్రయాణానికి చాలా కాలం ముందు ప్రారంభమైంది ఇంకా సంవత్సరాలుగా టైమ్‌లెస్ క్లాసిక్‌ల నుండి టాప్-ఆఫ్-లైన్ సూపర్‌బైక్‌ల వరకు రకరకాల బైక్‌లను నడిపే అవకాశం నాకు లభించింది అని అన్నారు.
TAM మీడియా రీసెర్చ్ ప్రకారం, ధోని బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలో పెరుగుదల అద్భుతంగా ఉంది, కేవలం అమితాబ్ బచ్చన్ మాత్రమే కాకుండా 34 బ్రాండ్‌లతో బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, 31 బ్రాండ్‌లతో కరీనా కపూర్ని కూడా అధిగమించాడు. బాలీవుడ్ సెలెబ్రిటీలు వెనుకంజలో ఉన్నప్పటికీ అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి స్క్రీన్ టైమ్‌లో ధోని ఇప్పటికీ సగటున రోజుకు 16 గంటల పాటు . స్క్రీన్ మీద వివిధ యాడ్స్ లో కనిపిస్తున్నాడట. అయితే ఐదేళ్ల కిందట ఇంటర్నేషనల్ క్రికెట్ కు ధోని .గుడ్‌బై చెప్పిన సంగతి మీకు తెలిసిందే.


Click it and Unblock the Notifications