For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Twitter Data Breach: ట్విట్టర్ యూజర్ల డేటా లీక్.. సల్మాన్, సుందర్ పిచాయ్ అకౌంట్ల వివరాలు హ్యాక్..

|

Twitter Data Breach: ఎలాన్ మస్క్ ఆధీనంలోని ట్విట్టర్‌లో ఇప్పటివరకు అతిపెద్ద డేటా లీక్ నమోదైంది. హ్యాకర్లు ఈ డేటాను డార్క్ వెబ్‌లో విక్రయిస్తున్నారు. అయితే ట్విట్టర్‌కు జరిమానా విధించకుండా ఉండటానికి హ్యాకర్లు ఈ డేటాను కొనుగోలు చేసేందుకు ఏకంగా ఎలాన్ మస్క్‌కు ఆఫర్ చేశారు. చాలా మంది హై ప్రొఫైల్ వ్యక్తుల వివరాలు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

డేటా ఉల్లంఘన..

డేటా ఉల్లంఘన..

ట్విట్టర్ యూజర్ల డేటా విక్రయానికి రావటం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఇందులో మెుత్తంగా 400 మిలియన్ యూజర్లకు సంబంధించిన డేటా హ్యాకర్ల చేతికి చిక్కింది. ఇప్పుడు దానిని వారు విక్రయించాలనుకోవటం ఎలాన్ మస్క్ కు అతిపెద్ద తొలనొప్పిగా మారింది. దీనికి ముందు గతంలో 54 లక్షల మంది యూజర్ల డేటా లీక్ అయ్యింది. దీనిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరోసారి డేటా బ్రీచ్ జరగటం భద్రతపై ఆందోళనలను పెంచేస్తోంది. గతంలో Facebook 533 మిలియన్ డేటాబేస్ లీక్ కావటంతో 275,000,000 డాలర్ల జరిమానా విధించబడింది.

హ్యాకర్ల సాక్ష్యాలు..

హ్యాకర్ల సాక్ష్యాలు..

ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (DPC) మునుపటి డేటా లీక్‌పై దర్యాప్తు ప్రారంభించిన తరుణంలో తాజాగా 400 మిలియన్ల మంది డేటా తస్కరణకు గురైనట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే కొత్త డేటా చోరీకి సంబంధించిన సాక్ష్యాలను హ్యాకర్లు సమర్పించారు. దీనిని బట్టి చోరీ నిజమేనని రుజువవుతోంది. పైగా హ్యాకర్లు హ్యాకర్ ఫోరమ్‌లో డేటా నమూనాను కూడా పోస్ట్ చేశారు. దానిలో అకౌంట్లకు సంబంధించిన కొన్ని వివరాలను హ్యాకర్లు చూపారు. ఈ డేటా లీక్‌లో చాలా మంది హై ప్రొఫైల్ వ్యక్తుల పేర్లు కూడా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ప్రముఖుల ఖాతాల వివరాలు..

ప్రముఖుల ఖాతాల వివరాలు..

హ్యాకర్లు.. సుందర్ పిచాయ్, డొనాల్డ్ ట్రంప్, సల్మాన్ ఖాన్, భారత సమాచార&ప్రసార మంత్రిత్వ శాఖ, డోనాల్డ్ ట్రంప్ జూనియర్, డోజా క్యాట్, NASAకు చెందిన JWST ఖాతా, WHO సోషల్ మీడియా, SpaceXతో పాటు మరిన్ని ట్విట్టర్ ఖాతాలకు చెందిన వివరాలను నమూనాగా ప్రదర్శించారు.

హ్యాకర్ల ఆఫర్..

హ్యాకర్ల ఆఫర్..

హ్యాకర్ ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే జరిమానా చెల్లించకుండా ఉండటానికి.. డేటాను కొనుగోలు చేయడానికి మీకు ఒకే ఒక ఎంపిక ఉందని హ్యాకర్ వ్రాశాడు. మిడిల్ మ్యాన్ ద్వారా డీల్ పూర్తి చేస్తానని హ్యాకర్ అందులో చెప్పాడు. డీల్ ద్వారా చెల్లింపు చేసినట్లయితే తస్కరించిన ఈ డేటాను తొలగిస్తామని మళ్లీ విక్రయించబోమని ఆఫర్ చేశారు. అయితే దీనిపై ఎలాన్ మస్క్ ఎలా స్పందింస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

English summary

Twitter Data Breach: ట్విట్టర్ యూజర్ల డేటా లీక్.. సల్మాన్, సుందర్ పిచాయ్ అకౌంట్ల వివరాలు హ్యాక్.. | 400 million twitter users hacked and put for sale in black website have salman khan details

400 million twitter users hacked and put for sale in black website have salman khan details
Story first published: Monday, December 26, 2022, 11:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X