Mutual funds: కరోనా అనంతరం ప్రజలు ఇన్వెస్ట్ మెంట్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు ఇప్పటికే పలు విశ్లేషణలు వచ్చాయి. ప్రస్తుతం వెలువడుతున్న గణాంకాలను చూస్తే మాత్రం భారీ స్థాయిలో ఈ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 'మ్యూచువల్ ఫండ్స్ సహీ హై' ట్యాగ్ లైన్ కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించడానికి బాగా పని చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల మంది కొత్తగా MFలో నమోదయ్యారు. కొవిడ్ విజృంభణ సమయంలో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ కొత్త స్థాయికి చేరుకున్నప్పుడు రికార్డు స్థాయిలో కోటి మంది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టారు. MFలు ఈ స్థాయిలో అమ్ముడు కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

మార్చి 31 నాటికి మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో నమోదైన మొత్తం పాన్ కార్డుల సంఖ్య 3.77 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇది కేవలం 3.37 కోట్లు మాత్రమే. AMFI డేటాను పరిశీలిస్తే SIPల ద్వారా ఇన్ ఫ్లోలు సైతం మార్చిలో రికార్డు స్థాయిలో 14 వేల 276 కోట్లకు వృద్ధి చెందాయి. ప్రస్తుతం MFలతో యాక్టివ్ గా ఉన్న SIPలు మార్చి చివరి నాటికి 6.36 కోట్లుగా ఉన్నాయి. వాటి నిర్వహణలోని ఆస్తులు మరో 6.83 లక్షల కోట్లు.
ఈ SIPలలో అధిక శాతం రెండేళ్లలోపువే కావడం విశేషం. 38 శాతం మంది ఒక సంవత్సరం కంటే తక్కువ కాలం పాటు అమలు చేస్తున్నారు. మరో 24% రెండేళ్లలోపు పని చేస్తున్నారు. మొత్తం SIPలలో ఐదేళ్ల క్రితం ప్రారంభమైనవి కేవలం 11 శాతం మాత్రమే ఉన్నాయి. నిర్వహణలో ఉన్న వారి ఆస్తులు సైతం మొత్తంలో దాదాపు నాలుగింట ఒక వంతుతోనే ఏర్పడ్డాయి.


Click it and Unblock the Notifications