Mudra loans: ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (PMMY) కింద 40.82 కోట్ల మంది లబ్ధి పొందినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 24 నాటికి బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు 23.2 లక్షల కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసినట్లు చెప్పారు. ఏప్రిల్ 7 నాటికి ఈ పథకం ప్రారంభించి 8 ఏళ్లు అయిన సందర్భంగా ఓ ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించారు.
వ్యవసాయ, కార్పొరేటేతర చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తల అభివృద్ధి కోసం ఏప్రిల్ 8, 2015న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముద్రా రుణాలను ప్రవేశపెట్టారు. 10 లక్షల వరకు తనఖా అవసరం లేకుండా, సులువుగా రుణాలు అందించేందుకు ఈ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. PMMY కింద రుణాలను మెంబర్ లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ (MLI) అయిన బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), మైక్రోఫైనాన్స్ సంస్థలు (MFIలు) నిర్వహిస్తున్నట్లు ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది.

PMMY లబ్ధిదారుల్లో 68 శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలే ఉన్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. 51 శాతం ఖాతాలు SC/ST, OBCలకు చెందినవేనన్నారు. దేశంలో ఔత్సాహిక వ్యాపారులకు క్రెడిట్ లభ్యతను సులభతరం చేయడం, కొత్త ఆవిష్కరణలు ప్రవేశపెట్టడం సహా తలసరి ఆదాయంలో స్థిరమైన పెరుగుదల సాధించడం కోసం ఈ రుణాలు తోడ్పాటు అందించాయంది.
MSMEల వృద్ధి మేక్ ఇన్ ఇండియా విజయవంతం కావడానికి భారీగా దోహదపడినట్లు నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. దేశీయంగా తయారైన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో ఈ పరిశ్రమలు ఉత్పత్తిని పెంచాయన్నారు. అట్టడుగు స్థాయిలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచడానికి మార్గం సుగమం చేశాయని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో వీటిని గేమ్ ఛేంజర్స్ గా పేర్కొన్నారు.
More From GoodReturns

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications