US Recession: వచ్చే ఏడాది అమెరికా మాంద్యంలోకి.. అదే దారిలో యూరో జోన్, బ్రిటన్‌లు.. ప్రజలపై భారం..
US Recession: ఆర్థికవేత్తల రాయిటర్స్ పోల్స్ ప్రకారం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన మందగమనంలో ఉందని తేలింది. కొన్ని కీలక ఆర్థిక వ్యవస్థలు అత్యధికంగా మాంద్యం ముప్పును ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కూల్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల వల్ల పరిస్థితులు జటిలంగా మారుతున్నాయని అంటున్నారు. పరిస్థితులను అదుపు చేసేందుకు సెంట్రల్ బ్యాంకులు రేట్ల తగ్గింపు చర్యలు స్పల్ప ఊరటను మాత్రమే ఇస్తున్నాయి.

ప్రమాదం ఏమిటంటే..
అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక వ్యవస్థలపై ప్రభావాన్ని పూర్తిగా అంచనా వేయటానికి తగిన సమయం తీసుకోకుండా వెంటవెంటనే రేట్ల పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇంత దూకుడుగా చర్యలు చేపట్టినప్పటికీ 50 ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణం ఇంకా తగ్గలేదు.

ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు..
US ఫెడరల్ రిజర్వ్ బుధవారం తరువాత మరో 75 బేసిస్ పాయింట్ల రేటు పెంపు ఉండవచ్చని తెలుస్తోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో జీవన వ్యయ సంక్షోభంగా మారింది. ఇది మాంద్యం ప్రమాదాలను పెంచుతోంది.

అమెరికా మాంద్యంలోకి వెళ్లే అవకాశం 40%..
వచ్చే సంవత్సరంలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మాంద్యం సంభవించే అవకాశం 40 శాతం ఉంది. ఇది మూడు నెలల క్రితం నుండి బాగా పెరిగింది. యూరో జోన్, బ్రిటన్‌లు కూడా మాంద్యంలోకి జారుకునే ప్రమాదం పెరిగిందని సిటీ బ్యాంక్ చీఫ్ గ్లోబల్ ఎకనామిస్ట్ నాథన్ తెలిపారు. ప్రపంచ మాంద్యం నిస్సందేహంగా, స్పష్టమైన ప్రస్తుత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

తగ్గిన వృద్ది అంచనాలు..
48 ఆర్థిక వ్యవస్థల్లో 77 శాతం వృద్ధి అంచనాలు వచ్చే ఏడాదికి తగ్గించబడ్డాయి. అదేవిధంగా.. 48 ఆర్థిక వ్యవస్థల్లో దాదాపు 90 శాతం ద్రవ్యోల్బణం అంచనాలు వచ్చే ఏడాదికి, 2024కి 45 శాతానికి పైగా అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. సంక్షోభం నుంచి ప్రజలకు ఉపశమనం రావటానికి చాలా సమయం అవసరమని ఈ లెక్కన తెలుస్తోంది.


Click it and Unblock the Notifications