IPO News: గ్రేమార్కెట్లో 4 ఐపీవోల దూకుడు.. బెట్టింగ్ బంగార్రాజులు గెట్ రెడీ..
Upcoming IPOs: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల ప్రవాహం ఎన్ని నెలలు గడుస్తున్నా ఆగటం లేదు. రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో రానున్న వారం సైతం మార్కెట్లోకి రానున్న ఐపీవోలు ఇన్వెస్టర్లకు కొత్త పెట్టుబడి అవకాశాలను తీసుకురానున్నాయి. దీంతో అనేక మంది ఐపీవో ప్రియులు కొత్త పెట్టుబడుల కోసం ఇప్పటికే డబ్బును సమకూర్చుకుంటున్నారు.
1. అంబే లేబొరేటరీస్ ఐపీవో:
ఈ ఐపీవో జూలై 4న ప్రారంభమైంది. పెట్టుబడిదారులు దీనికి సభ్యత్వం పొందేందుకు జూలై 8 వరకు అంటే రేపటి వరకు అవకాశం ఉంది. ఐపీవో కోసం కంపెనీ ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.65 నుంచి రూ.68గా నిర్ణయించింది. కంపెనీ ఇన్వెస్టర్ల కోసం లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా ఉంచింది. ఇప్పటికే కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.12.73 కోట్లను సమీకరించింది. ప్రస్తుతం గ్రేమార్కెట్లో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.46 ప్రీమియం రేటుతో ట్రేడింగ్ అవుతున్నాయి.

2. గణేష్ గ్రీన్ ఇండియా ఐపీవో:
కంపెనీ తన ఐపీవోను జూలై 5న ప్రారంభించగా.. జూలై 9 వరకు ఇన్వెస్టర్లు పందెం వేసే అవకాశం ఉంటుంది. కంపెనీ ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ రూ.181 నుంచి రూ.190గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 600 షేర్లుగా అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం కంపెనీ ఐపీవో షేర్లకు గ్రేమార్కెట్ ప్రీమియం ధర రూ.220గా పలుకుతోంది. ఇదే ధర లిస్టింగ్ వరకు కొనసాగితే తొలిరోజే ఇన్వెస్టర్లు ఏకంగా 100 శాతానికి పైగా లాభాలను అందుకునే అవకాశం ఉంది.
3. ఎఫ్వా ఇన్‌ఫ్రా అండ్ రీసెర్చ్ ఐపీవో:
ఈ కంపెనీ ఐపీవో కూడా జూలై 5న ప్రారంభమైంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.51.27 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఐపీవోలో షేర్ల కోసం ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకునేందుకు జూలై 9 వరకు ఇంకా అవకాశం ఉంది. ఈ క్రమంలో కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.78 నుంచి రూ.82గా ఉంది. కంపెనీ షేర్లు ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో రూ.95 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి.
4- సహజ్ సోలార్ ఐపీవో:
ఐపీవో జూలై 11 నుంచి జూలై 15 వరకు పెట్టుబడిదారులు బెట్ వేసేందుకు తెరచి ఉంటుంది. కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.171 నుంచి రూ.180గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని కంపెనీ 800 షేర్లుగా ఉంచింది. నేడు కంపెనీ షేర్ ధర గ్రేమార్కెట్లో రూ.100 ప్రీమియం రేటుతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications