Car Loan: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా..?? ఈ 4 బ్యాంకుల సూపర్ ఆఫర్లు..
EV Car Loan: భారత ప్రభుత్వం పన్ను మినహాయింపులు మరియు ఇతర ప్రోత్సాహకాలను అందించడం ద్వారా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని బ్యాంకులు ప్రత్యేక లోన్ ఆఫర్లతో ముందుకొస్తున్నాయి.
SBI ఎలక్ట్రిక్ వెహికల్ లోన్:
స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు కారు రుణాలపై 0.25 శాతం వడ్డీ రాయితీని అందిస్తోంది. పైగా జనవరి 31, 2024 వరుక జీరో ప్రాసెసింగ్ ఫూజును అందుబాటులో ఉంచింది. గ్రీన్ కార్ లోన్ కింద ఎలక్ట్రిక్ కార్లపై 8.75 శాతం నుంచి 9.45 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అలాగే ఎంపిక చేసిన మోడల్‌లపై రుణ సహాయం 90% నుంచి 100% వరకు ఉంది.

యూనియన్ బ్యాంక్ గ్రీన్ మైల్స్:
క్రెడిట్ స్కోర్ ఆధారంగా యూనియన్ బ్యాంక్ తన కస్టర్లకు 9.15 శాతం నుంచి 12.25 శాతం మధ్య వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. అలాగే ముందస్తు లోన్ సెటిల్మెంట్లపై పెనాల్టీ ఉండదని ప్రకటించింది.
PNB గ్రీన్ కార్ లోన్:
కొత్త కారు కొనాలనుకునే కస్టమర్లకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆన్-రోడ్ ధర పూర్తిగా ఫైనాన్స్ చేయబడింది. అలాగే ఎలక్ట్రిక్ వాహనం లోన్ విషయానికి వస్తే.. ఆన్-రోడ్ ధరపై 25% రాయితీ. ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఫీజులు లేవు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర:
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలక్ట్రిక్ గ్రీన్ కార్ లోన్ స్కీమ్ ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలను వసూలు చేయదు. ఇప్పటికే ఉన్న మహా సూపర్ కార్ లోన్ స్కీమ్ నుంచి ROIపై బ్యాంక్ 0.25% రాయితీని అందిస్తుంది.మహా కార్ లోన్ వడ్డీ రేట్లు CIBIL స్కోర్‌పై ఆధారపడి 8.8% నుంచి 13% వరకు ఉంటాయి. ముందస్తు చెల్లింపు, ప్రీ-క్లోజర్, పాక్షిక చెల్లింపు కోసం ఎటువంటి ఛార్జీ లేదు.


Click it and Unblock the Notifications